పాక్‌ క్రికెటర్ల ఫొటోలు తొలగింపు

Punjab Cricket Association Removes Pakistani Cricketers Photos - Sakshi

చండీగఢ్‌: పుల్వామా ఘటన నేపథ్యంలో పంజాబ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (పీసీఏ) తమ తరఫున నిరసన వ్యక్తం చేసింది. మొహాలి క్రికెట్‌ స్టేడియంలో ఉన్న 15 మంది పాకిస్తాన్‌ క్రికెటర్ల ఫొటోలను పీసీఏ తొలగించింది. స్టేడియంలో లోపలి భాగంలో గ్యాలరీలో, రిసెప్షన్‌ వద్ద, ‘హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌’లో ఈ చిత్రాలు ఉన్నాయి. ‘జవాన్ల పై దాడికి సంబంధించి దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు ఉన్నాయి. మేం కూడా దానికి అతీతులం కాదు. చనిపోయిన కుటుంబాలకు సంఘీభావం ప్రకటిస్తూ మా వైపు నుంచి ఈ చర్య తీసుకున్నాం’ అని పీసీఏ కోశాధికారి అజయ్‌ త్యాగి చెప్పారు. తొలగించిన వాటి జాబితాలో పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌తో పాటు మియాందాద్, వసీం అక్రమ్, షాహిద్‌ అఫ్రిది తదితరుల ఫొటోలు ఉన్నాయి. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top