Harbhajan Singh: పంజాబ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌కు భజ్జీ వార్నింగ్‌..

Harbhajan Singh Alleges Illegal Activities At Punjab Cricket Association - Sakshi

టీమిండియా మాజీ క్రికెటర్‌.. ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎంపీ హర్భజన్‌ సింగ్‌ పంజాబ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌(పీసీఏ)కు వార్నింగ్‌ ఇచ్చాడు. బీసీసీఐ నిబంధనలు ఖాతరు చేయకుండా  పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ చీఫ్ గుల్జారీందర్ చాహల్  అక్రమాలకు పాల్పడుతున్నాడని పేర్కొన్నాడు. అధికారాన్ని గుప్పిట్లో ఉంచుకుని అక్రమాలకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించాడు. పంజాబ్ క్రికెట్ అసోసియేషన్.. పంజాబ్, కేంద్ర పాలిత ప్రాంతమైన చండీగఢ్ లకు గవర్నింగ్ బాడీగా వ్యవహరిస్తున్నది. మాజీ క్రికెటర్, నటుడు గుల్జారీందర్ చాహల్ పీసీఏ చీఫ్ కాగా ఇంద్రజిత్ సింగ్ బింద్రా చైర్మెన్ గా ఉన్నాడు. హర్భజన్ సింగ్ పీసీఏలో చీఫ్ అడ్వైజర్ గా ఉన్నాడు. 

ఈ నేపథ్యంలోనే భజ్జీ పీసీఏకు బహిరంగ లేఖ రాశాడు.''ప్రస్తుత పీసీఏ అధ్యక్షుడు  అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమాలకు పాల్పడుతున్నాడని  గడిచిన వారం పది రోజులుగా పంజాబ్ క్రికెట్ ప్రేమికులు, స్టేక్ హోల్డర్ల నుంచి పలు ఫిర్యాదులు అందుకుంటున్నా.ఇది  పారదర్శకత,క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని నాకు అనేక ఫిర్యాదులు అందుతున్నాయి. ఓటింగ్ హక్కులతో దాదాపు 150 మంది సభ్యులను చేర్చుకోవడానికి పీసీఏ తీవ్రంగా ప్రయత్నిస్తుందని తెలుస్తున్నది.

ఇది బీసీసీఐ రాజ్యాంగానికి విరుద్ధం. అంతేగాక పీసీఏ మార్గదర్శకాలు, పారదర్శకత ఉల్లంఘన కిందికే వస్తుంది.. ఈ వ్యవహారానికి సంబంధించి ఇదివరకే బీసీసీఐ అంబుడ్స్‌మెన్ కు ఫిర్యాదులు కూడా అందినట్టు తెలుస్తున్నది. పీసీఏలో ఉన్నత స్థాయిలో ఉన్న  వ్యక్తులు తమపై వచ్చిన ఆరోపణలను కప్పిపుచ్చుకోవడానికి, అక్రమాలను దాచడానికి కనీసం సాధారణ సమావేశాలకు కూడా పిలవకుండా ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. వారి స్వప్రయోజనాల కోసం  క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు''అని పేర్కొన్నాడు. 

చదవండి: '110 శాతం ఫిట్‌గా ఉన్నా.. టీమిండియాతో పోరుకు సిద్ధం'

'అసలు ధోనిలానే లేడు.. ఎవరు తయారు చేశారో కానీ!'

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top