మొహాలీలో స్పోర్టింగ్ వికెట్ | Mohali Will Offer a 'Sporting Pitch' For First Test: MP Pandav | Sakshi
Sakshi News home page

మొహాలీలో స్పోర్టింగ్ వికెట్

Oct 31 2015 12:03 AM | Updated on Sep 3 2017 11:44 AM

దక్షిణాఫ్రికాతో జరుగబోయే తొలి టెస్టుకు మంచి స్పోర్టింగ్ వికెట్‌ను తయారుచేసినట్టు పంజాబ్ క్రికెట్ సంఘం (పీసీఏ) కార్యదర్శి ఎంపీ పండావ్ తెలిపారు.

మొహాలీ: దక్షిణాఫ్రికాతో జరుగబోయే తొలి టెస్టుకు మంచి స్పోర్టింగ్ వికెట్‌ను తయారుచేసినట్టు పంజాబ్ క్రికెట్ సంఘం (పీసీఏ) కార్యదర్శి ఎంపీ పండావ్ తెలిపారు. ప్రారంభంలో పేసర్లు రాణించినా ఆ తర్వాత స్పిన్నర్లు కీలకమవుతారని చెప్పారు. ‘మా శాయశక్తులా మంచి క్రికెటింగ్ వికెట్‌ను రూపొందించేందుకు ప్రయత్నించాం. బ్యాట్స్‌మెన్‌తో పాటు బౌలర్లకు కూడా లాభించేలా ఉంటుంది. పిచ్ అవుట్ ఫీల్డ్ పూర్తి పచ్చికతో ఉంది. కచ్చితంగా ఇక్కడ అభిమానులకు చక్కటి క్రికెట్ వినోదం లభిస్తుంది’ అని పాండోవ్ తెలిపారు.

1న ప్రొటీస్ జట్టు మొహాలీకి చేరుకోనుంది. అదే రోజు ఢిల్లీలో హర్భజన్ వివాహ విందు ఉండడంతో భారత్ ఆటగాళ్లు మర్నాడు రానున్నారు. 5 నుంచి 9 వరకు మ్యాచ్ జరుగుతుంది. అయితే టిక్కెట్ల అమ్మకాలు మాత్రం ఏమాత్రం ఆశాజనకంగా లేవు. వీటి రేట్లను తగ్గిస్తే టెస్టులను చూసేందుకు ఎక్కువ సంఖ్యలో అభిమానులు వస్తారని పాండోవ్ అభిప్రాయపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement