భారత్‌తో వన్డే సిరీస్‌.. రెండు జట్లు ప్రకటించిన న్యూజిలాండ్‌ | New Zealand Announce Two Squads For ODI Series Vs Team-India Under Mitchell Santner’s Captaincy, Check Names Inside | Sakshi
Sakshi News home page

భారత్‌తో వన్డే సిరీస్‌.. రెండు జట్లు ప్రకటించిన న్యూజిలాండ్‌

Oct 11 2026 9:24 AM | Updated on Oct 11 2026 10:57 AM

New Zealand Announce Two-Squads For ODI Series Vs Team-India

అక్టోబర్ చివరి వారంలో భారత జట్టు న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు టీమిండియా జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు వన్డే సిరీస్ కోసం రెండు జట్లను ప్రకటించడం విశేషం. ఫిన్ అలెన్‌, లోకి ఫెర్గూసన్‌, రచిన్ రవీంద్ర, టిమ్ సీఫెర్ట్‌లు వన్డే జట్టుకు ఎంపికయ్యారు. 

మిచెల్ సాంట్నర్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఇక ఫిన్ అలెన్, ఫెర్గూసన్‌లు న్యూజిలాండ్ తరఫున చివరగా 2023 వన్డే ప్రపంచకప్‌లో ఆడడం గమనార్హం. టిమ్ సీఫెర్ట్ 18 నెలల విరామం అనంతరం వన్డేలకు ఎంపికయ్యాడు. భుజం గాయం కారణంగా భారత్‌తో టీ20 సిరీస్‌కు దూరంగా ఉండనున్న రచిన్ రవీంద్ర తొలి మూడు వన్డేలకు జట్టులో చోటు దక్కించుకున్నాడు.

మూడో వన్డే తర్వాత టెస్టు సిరీస్ నేపథ్యంలో జట్టులోని కొందరు సభ్యులు వెల్లింగ్టన్ వెళ్లనుండడంతో.. నాలుగు, ఐదు వన్డేలకు వారి స్థానాల్లో ఏడుగురు ఆటగాళ్లు జట్టులో అదనంగా చేరనున్నారు. మొదటి మూడు మ్యాచ్‌ల్లో రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్‌, డెవన్ కాన్వే, మాట్ హెన్రీ, కైల్ జేమీసన్‌, టామ్ లాథమ్‌, డారిల్ మిచెల్ ఆడనున్నారు. 

ఇక నాలుగు, ఐదు వన్డేలకు వీరి స్థానాల్లో ఫిన్ అలెన్‌, క్రిస్టియన్ క్లార్క్‌, మాట్ ఫిషర్‌, లాకీ ఫెర్గూసన్‌,. మిచ్ హే, నిక్ కెల్లీ, టిమ్ సీఫెర్ట్‌ ఎంపికయ్యారు. ఈ రెండు జట్లలో కెప్టెన్ మిచెల్ సాంట్నర్‌, మార్క్ చాప్‌మన్‌, మైకెల్ బ్రాస్‌వెల్‌, బ్లెయిర్ టింక్నర్‌, జాకబ్ డఫీ, విల్ యంగ్‌లు కామన్‌గా ఉన్నారు. టీమిండియాతో జరగనున్న రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ కోసం న్యూజిలాండ్ బోర్డు 14 మందితో కూడిన జట్టును నవంబర్‌లో  ప్రకటించనుంది.

సొంతగడ్డపై టీమిండియాతో న్యూజిలాండ్‌ తొలుత ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను అక్టోబర్ 22 నుంచి నవంబర్ 1 మధ్య ఆడనుంది. ఆ తర్వాత నవంబర్ 4 నుంచి ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్ జరగనుంది. ఆపై ఇరుజట్లు రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడనున్నాయి. కాగా ఈ ఏడాది జనవరిలో భారత్‌లో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను న్యూజిలాండ్ 2-1తో గెలుచుకున్న సంగతి తెలిసిందే.

న్యూజిలాండ్ జట్టు (తొలి మూడు వన్డేలకు): మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), మైఖేల్ బ్రాస్‌వెల్, మార్క్ చాప్‌మన్, డెవాన్ కాన్వే, జాకబ్ డఫీ, మాట్ హెన్రీ, కైల్ జేమీసన్, టామ్ లాథమ్ (వికెట్ కీపర్), డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, నాథన్ స్మిత్, విల్ యంగ్, బ్లెయిర్ టిక్నర్

నాలుగు, ఐదు వన్డేలకు కివీస్‌ జట్టు: మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), ఫిన్ అలెన్, మైఖేల్ బ్రాస్‌వెల్‌, మార్క్ చాప్‌మన్, క్రిస్టియన్ క్లార్క్, జాకబ్ డఫీ, మాట్ ఫిషర్, లాకీ ఫెర్గూసన్, మిచ్ హే (వికెట్ కీపర్), నిక్ కెల్లీ, టిమ్ సీఫెర్ట్ (వికెట్ కీపర్), బ్లెయిర్ టిక్నర్, విల్ యంగ్

ఇదీ చదవండి: 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement