Photo Credit: Twitter
భారత పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియా-ఎ జట్టు మూడు మ్యాచ్‌ల అనధికారిక వన్డే సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో సొంతం చేసుకుంది. పాండిచ్చేరి వేదికగా శుక్రవారం జరిగిన రెండో అనధికారిక వన్డేలో ఆస్ట్రేలియా చేతిలో 69 పరుగుల తేడాతో భారత్ ఓటమి చవిచూసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా-ఎ జట్టు 49.5 ఓవర్లలో 275 పరుగులకు ఆలౌటైంది.
ఓపెనర్ సామ్ కొన్‌స్టాస్ (67), జోష్ ఫిలిప్ (58) అర్థసెంచరీలు సాధించారు. భారత బౌలర్లలో అర్షద్ ఖాన్ 3 వికెట్లు తీయగా.. యశ్ ఠాకూర్ రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన భారత జట్టు 45.2 ఓవర్లలో 206 పరుగులకు ఆలౌటైంది. రజత్ పాటీదార్ (67) అర్థసెంచరీ సాధించగా.. చివర్లో అనుకుల్ రాయ్ (34 నాటౌట్) ఒంటరిపోరాటం చేసినప్పటికీ మిగతావారి నుంచి సహకారం కరువయ్యింది.
ఆసీస్ బౌలర్లలో స్పెన్సర్ జాన్సన్ 3 వికెట్లు తీయగా, రిలే మెరిడిత్, తన్వీర్ సంగాలు చెరో 2 వికెట్లు పడగొట్టారు. ఇరుజట్ల మధ్య మూడో వన్డే అక్టోబర్ 11న జరగనుంది. అంతకముందు జరిగిన రెండు అనధికారిక టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 1-0తో సొంతం చేసుకుంది. బ్యాటింగ్‌లో ఏడు బంతుల్లో 14 పరుగులు చేయడంతో పాటు బౌలింగ్‌లో మూడు కీలక వికెట్లు తీసిన స్పెన్సర్ జాన్సన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు సొంతం చేసుకున్నాడు.
ఇదీ చదవండి: టెస్టు క్రికెట్‌లో స్టీవ్ స్మిత్ అరుదైన ఫీట్


