Photo Credit: Twitter
డర్బన్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న మొదటి టెస్టులో ఆస్ట్రేలియా సీనియర్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ అరుదైన ఫీట్ సాధించాడు. ఆస్ట్రేలియా తరఫున టెస్టుల్లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ల జాబితాలో స్టీవ్ స్మిత్ మూడో స్థానానికి చేరుకున్నాడు. 8 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఆసీస్ దిగ్గజం స్టీవ్ వా రికార్డును (10,927 పరుగులు) స్మిత్ అధిగమించాడు.
ఓవరాల్‌గా ఆస్ట్రేలియా టెస్టు క్రికెట్‌లో అత్యధిక పరుగుల రికార్డు మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ పేరిట ఉంది. పాంటింగ్ 168 టెస్టుల్లో 13,378 పరుగులతో టాప్‌లో కొనసాగుతున్నాడు. పాంటింగ్ తర్వాతి స్థానంలో మరో దిగ్గం అలెన్ బోర్డర్ 156 టెస్టుల్లో 11,174 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు.
తాజాగా 125 టెస్టుల్లోనే స్టీవ్ వా టెస్టుల్లో సాధించిన పరుగులను దాటేసి మూడో స్థానానికి చేరుకున్న స్మిత్.. ఇప్పుడు అలెన్ బోర్డర్‌ను కూడా వెనక్కి నెట్టేసే అవకాశం అతడి ముంగిట ఉంది. ఇప్పటివరకు 125 టెస్టుల్లో 10,900 పరుగులకు పైగా చేసిన స్మిత్ ఖాతాలో 37 సెంచరీలు, 45 ఫిఫ్టీలున్నాయి.
ఆస్ట్రేలియా తరఫున అత్యధిక సెంచరీల రికార్డు రికీ పాంటింగ్ పేరిట ఉంది. పాంటింగ్ 41 సెంచరీలు చేశాడు. పాంటింగ్ సెంచరీల రికార్డును అధిగమించేందుకు స్మిత్ నాలుగు సెంచరీల దూరంలో మాత్రమే ఉన్నాడు. త్వరలో పాంటింగ్‌ను అధిగమించి టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆసీస్ బ్యాటర్‌గా స్మిత్ నిలిచే అవకాశముంది.
ఇక టెస్టు క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్ (200 మ్యాచ్‌ల్లో 15,921 పరుగులు) తొలి స్థానంలో కొనసాగుతుండగా, ఇంగ్లండ్ స్టార్ జో రూట్ (169 టెస్టుల్లో 14,278 పరుగులు) రెండో స్థానంలో, పాంటింగ్ (168 టెస్టుల్లో 13,378 పరుగులు) మూడో స్థానంలో, జాక్ కల్లిస్ (166 టెస్టుల్లో 13, 289 పరుగులు), రాహుల్ ద్రవిడ్ (164 టెస్టుల్లో 13,288 పరుగులు) నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు.
ఈతరం టెస్టు బ్యాటర్లలో ప్యాబ్-4గా గుర్తింపు పొందిన నలుగురిలో స్మిత్ ఒకడిగా గుర్తింపు పొందాడు. జో రూట్ (ఇంగ్లండ్), కేన్ విలియమ్సన్ (న్యూజిలాండ్), విరాట్ కోహ్లి (భారత్) మిగిలిన ముగ్గురు. ఈ ముగ్గురిలో విలియమ్సన్, కోహ్లి ఇప్పటికే టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. దీంతో ఫ్యాబ్-4 కాస్తా ఫ్యాబ్-2గా మారిపోయింది.
ఇదీ చదవండి: పదేళ్ల తర్వాత జట్టులోకి.. టెస్టు చరిత్రలోనే చెత్త రికార్డు!


