ప‌దేళ్ల త‌ర్వాత జ‌ట్టులోకి.. టెస్టు చరిత్ర‌లోనే చెత్త రికార్డు! | Nic Maddinson-33-Ball Duck Unwanted Record SA Vs AUS 1st Test | Sakshi
Sakshi News home page

ప‌దేళ్ల త‌ర్వాత జ‌ట్టులోకి.. టెస్టు చరిత్ర‌లోనే చెత్త రికార్డు!

Oct 9 2026 3:37 PM | Updated on Oct 9 2026 4:15 PM

Nic Maddinson-33-Ball Duck Unwanted Record SA Vs AUS 1st Test

డ‌ర్బ‌న్ వేదిక‌గా సౌతాఫ్రికాతో జ‌రుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా ఓపెన‌ర్ నిక్ మాడిస‌న్ అత్యంత చెత్త రికార్డును మూట‌గ‌ట్టుకున్నాడు. దాదాపు ప‌దేళ్ల త‌ర్వాత జ‌ట్టులోకి వ‌చ్చిన నిక్ మాడిస‌న్ 33 బంతులాడి ప‌రుగులేమి చేయ‌కుండానే డ‌కౌట్‌గా వెనుదిరిగాడు. ఈ నేప‌థ్యంలో టెస్టు చ‌రిత్ర‌లో నిక్ మాడిస‌న్‌ది మూడో లాంగెస్ట్ డ‌కౌట్ (బంతుల పరంగా) కావ‌డం గ‌మ‌నార్హం. 

ఆసీస్‌ ఓపెనర్‌ నిక్ మాడిస‌న్ కంటే ముందు న్యూజిలాండ్ ఓపెన‌ర్ డారిన్ ముర్రే (39 బంతుల్లో డ‌కౌట్‌, 1995లో శ్రీలంక‌తో టెస్టులో) తొలి స్థానంలో ఉండ‌గా, జింబాబ్వే ఓపెన‌ర్ ట్రెవ‌ర్ గ్రిప్ప‌ర్ (36 బంతుల్లో డ‌కౌట్‌, 2000 మార్చిలో వెస్టిండీస్‌పై) రెండో స్థానంలో కొన‌సాగుతున్నాడు. తాజాగా నిక్ మాడిస‌న్ 33 బంతుల్లో డ‌కౌటయ్యి మూడో స్థానంలో నిలిచాడు. ఇక నాలుగో స్థానంలో జింబాబ్వే ఓపెన‌ర్ మార్క్ డెక్క‌ర్ (30 బంతుల్లో) ఉన్నాడు. ఇంగ్లండ్ ఓపెన‌ర్ బ్రియాన్ ల‌క్ హ‌ర్ట్స్ (29 బంతుల్లో) ఐదో స్థానంలో ఉన్నాడు.

ఆసీస్ త‌ర‌ఫున మొద‌టి స్థానంలో..
ఇక ఆస్ట్రేలియా త‌ర‌ఫున టెస్టుల్లో అత్యంత ఎక్కువ బాల్స్ ఆడి డ‌కౌట్ అయిన ఓపెన‌ర్‌గా నిక్ మాడిస‌న్ నిలిచాడు. గ‌తంలో 2022లో హోబ‌ర్ట్ వేదిక‌గా జ‌రిగిన టెస్టులో ఓపెన‌ర్‌ డేవిడ్ వార్న‌ర్ (22 బంతుల్లో డ‌కౌట్) ఇప్ప‌టివ‌రకు లాంగెస్ట్ డ‌కౌట్‌గా ఉండేది. తాజాగా వార్న‌ర్‌ను నిక్ మాడిస‌న్ ఏకంగా 11 బంతుల తేడాతో అధిగ‌మించాడు. 

ఇక మ్యాచ్‌ విషయానికొస్తే.. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో తడబడుతోంది. 26 ఓవర్లు ముగిసేసరికి మూడు వికెట్లు నష్టపోయి 84 పరుగులు చేసింది. స్టీవ్ స్మిత్ (25) క్రీజులో ఉన్నాడు. అంతకముందు ఓపెనర్ నిక్ మాడిసన్  డకౌట్ కాగా, మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్ (9) పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు. లబుషేన్ (37) మంచి టచ్‌లో కనిపించినప్పటికీ, వియాన్ ముల్డర్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. ముల్డర్‌ రెండు వికెట్లు తీశాడు.

ఇదీ చదవండి:  SA Vs AUS: ఆస్ట్రేలియా క్రికెట్‌ చరిత్రలోనే తొలిసారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement