breaking news
Nic Maddinson
-
AUS vs SA: క్రికెట్ ఆస్ట్రేలియా సంచలన నిర్ణయం
దక్షిణాఫ్రికాతో అక్టోబర్ 27 నుంచి ప్రారంభం కానున్న నిర్ణయాత్మక మూడో టెస్టుకు ముందు ఆస్ట్రేలియా జట్టులో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. రీఎంట్రీలో నిరాశపరిచిన ఓపెనర్ నిక్ మ్యాడిన్సన్ ను స్క్వాడ్ నుంచి క్రికెట్ ఆస్ట్రేలియా తప్పించింది. అతడితో పాటు వికెట్ కీపర్ సామ్ హర్పర్ను ఉన్నపళంగా స్వదేశానికి వచ్చేయాలని ఆసీస్ క్రికెట్ బోర్డు ఆదేశించింది. అయితే రెండో టెస్టులో గాయపడిన స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ ఫిట్‌నెస్‌పై ఇంకా సందిగ్ధం కొనసాగుతోంది. మెడ గాయం నుంచి స్మిత్ ఇంకా పూర్తిగా కోలుకోలేదు. మూడో టెస్టుకు ముందు నిర్వహించిన ప్రాక్టీస్ సెషన్లో స్మిత్ కేవలం 20 నిమిషాలు మాత్రమే పాల్గొన్నట్లు ఆస్ట్రేలియా కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ తెలిపాడు. కోచ్ వ్యాఖ్యలను బట్టి చూస్తే అతడు కీలకమైన మూడో టెస్టులో ఆడేది అనుమానమే.మ్యాడిన్సన్పై వేటుకెమెరాన్ గ్రీన్ గాయపడటంతో ఆఖరి నిమిషంలో పదేళ్ల తర్వాత జట్టులోకి వచ్చిన నిక్ మ్యాడిన్సన్ ఓపెనర్‌గా బాధ్యతలు చేపట్టాడు. అయితే గ్వెబెరా టెస్టుతో కలిపి గత నాలుగు ఇన్నింగ్స్‌ల్లో రెండు సార్లు డకౌట్ అయ్యాడు. ఈ క్రమంలోనే అతడిని జట్టు నుంచి సెలక్టర్లు తప్పించారు. అతడు షెఫీల్డ్ షీల్డ్ డొమెస్టిక్ టోర్నీలో ఆడి ఫామ్ అందుకోవాలని హెడ్ సెలక్టర్ జార్జ్ బెయిలీ స్పష్టం చేశాడు. ఇక తొలి రెండు టెస్టులకు దూరమైన గ్రీన్, వికెట్ కీపర్ జోష్ ఇంగ్లిష్ పూర్తి ఫిట్నెస్ సాధించి జట్టుతో కలిశారు. వీరిద్దరూ మూడో టెస్టులో ఆడే అవకాశముంది.3వ టెస్టుకు ఆస్ట్రేలియా అప్డేటడ్ స్క్వాడ్పాట్ కమ్మిన్స్ (కెప్టెన్), స్కాట్ బోలాండ్, అలెక్స్ కేరీ, కూపర్ కానలీ, కెమెరాన్ గ్రీన్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మాథ్యూ కుహ్నెమాన్, మార్నస్ లబుషేన్, నాథన్ లయాన్, మైఖేల్ నేసర్, మాథ్యూ రెన్షా, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, బ్యూ వెబ్‌స్టర్. -
పదేళ్ల తర్వాత జట్టులోకి.. టెస్టు చరిత్రలోనే చెత్త రికార్డు!
డర్బన్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా ఓపెనర్ నిక్ మాడిసన్ అత్యంత చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. దాదాపు పదేళ్ల తర్వాత జట్టులోకి వచ్చిన నిక్ మాడిసన్ 33 బంతులాడి పరుగులేమి చేయకుండానే డకౌట్‌గా వెనుదిరిగాడు. ఈ నేపథ్యంలో టెస్టు చరిత్రలో నిక్ మాడిసన్ది మూడో లాంగెస్ట్ డకౌట్ (బంతుల పరంగా) కావడం గమనార్హం. ఆసీస్ ఓపెనర్ నిక్ మాడిసన్ కంటే ముందు న్యూజిలాండ్ ఓపెనర్ డారిన్ ముర్రే (39 బంతుల్లో డకౌట్, 1995లో శ్రీలంకతో టెస్టులో) తొలి స్థానంలో ఉండగా, జింబాబ్వే ఓపెనర్ ట్రెవర్ గ్రిప్పర్ (36 బంతుల్లో డకౌట్, 2000 మార్చిలో వెస్టిండీస్‌పై) రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. తాజాగా నిక్ మాడిసన్ 33 బంతుల్లో డకౌటయ్యి మూడో స్థానంలో నిలిచాడు. ఇక నాలుగో స్థానంలో జింబాబ్వే ఓపెనర్ మార్క్ డెక్కర్ (30 బంతుల్లో) ఉన్నాడు. ఇంగ్లండ్ ఓపెనర్ బ్రియాన్ లక్ హర్ట్స్ (29 బంతుల్లో) ఐదో స్థానంలో ఉన్నాడు.ఆసీస్ తరఫున మొదటి స్థానంలో..ఇక ఆస్ట్రేలియా తరఫున టెస్టుల్లో అత్యంత ఎక్కువ బాల్స్ ఆడి డకౌట్ అయిన ఓపెనర్‌గా నిక్ మాడిసన్ నిలిచాడు. గతంలో 2022లో హోబర్ట్ వేదికగా జరిగిన టెస్టులో ఓపెనర్ డేవిడ్ వార్నర్ (22 బంతుల్లో డకౌట్) ఇప్పటివరకు లాంగెస్ట్ డకౌట్‌గా ఉండేది. తాజాగా వార్నర్‌ను నిక్ మాడిసన్ ఏకంగా 11 బంతుల తేడాతో అధిగమించాడు. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో తడబడుతోంది. 26 ఓవర్లు ముగిసేసరికి మూడు వికెట్లు నష్టపోయి 84 పరుగులు చేసింది. స్టీవ్ స్మిత్ (25) క్రీజులో ఉన్నాడు. అంతకముందు ఓపెనర్ నిక్ మాడిసన్ డకౌట్ కాగా, మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్ (9) పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు. లబుషేన్ (37) మంచి టచ్‌లో కనిపించినప్పటికీ, వియాన్ ముల్డర్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. ముల్డర్ రెండు వికెట్లు తీశాడు.ఇదీ చదవండి: SA Vs AUS: ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్రలోనే తొలిసారి


