ఆసియా క్రీడలు 2026 క్రికెట్ టోర్నీ ఫైనల్లో టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని పాక్ ఆల్‌రౌండర్ సైమ్ అయూబ్ హేళన చేసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో సూర్యవంశీని అవుట్ చేసిన తర్వాత సైమ్ అయూబ్ ‘బేబీసిట్టింగ్’ తరహా సెలబ్రేషన్ చేసుకోవడం తీవ్ర వివాదాస్పదమైంది.
దీంతో అయూబ్‌పై సర్వాత్ర విమర్శల వర్షం కురుస్తోంది. భారత అభిమానులతో పాటు పలువురు పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు సైతం అయూబ్ ప్రవర్తనను తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఈ క్రమంలో పాకిస్థాన్ మాజీ వికెట్ కీపర్-బ్యాటర్ కమ్రాన్ అక్మల్, సైమ్ అయూబ్ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేవలం సోషల్ మీడియా పబ్లిసిటీ కోసమే అయూబ్ ఇలాంటి పనులకు పాల్పడుతున్నారని ఆయన విమర్శించారు
"ప్రస్తుతం మన జట్టు ప్రదర్శన అంత గొప్పగా ఏమీ లేదు. కానీ సోషల్ మీడియాలో హైలైట్ అవ్వడం కోసం గత కొంతకాలంగా ఇలాంటి చర్యలు జరుగుతూనే ఉన్నాయి. ఇది అంతర్జాతీయ క్రికెట్ అనే విషయాన్ని టీమ్ మేనేజ్‌మెంట్ గుర్తించాలి.
వైభవ్ సూర్యవంశీకి 13, 14 లేదా 15 ఏళ్లు కావచ్చు.. కానీ అతడు తన ప్రతిభతో సీనియర్ స్థాయిలో అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్నాడు. సైమ్ అయూబ్ ఇంకా చిన్న పిల్లాడు కాదు, ముందు తన సొంత ప్రదర్శనపై దృష్టి పెడితే మంచిది" అని అక్మల్ గేమ్ ప్లాన్’ యూట్యూబ్ షోలో పేర్కొన్నాడు.
కాగా ఫైనల్ మ్యాచ్‌లో అయూబ్ దారుణంగా విఫలమయ్యాడు. వైభవ్ సూర్యవంశీ వికెట్ తీసినప్పటికీ అయూబ్ తన నాలుగు ఓవర్లలో 47 పరుగులు సమర్పించుకున్నాడు. ఫీల్డింగ్‌లో రెండు క్యాచ్‌లను జారవిడిచాడు. అదేవిధంగా బ్యాటింగ్‌లో 22 బంతులు ఎదుర్కొని 29 పరుగులు ఔటయ్యాడు.
చదవండి: IND vs WI: వైభవ్ సూర్యవంశీపై వేటు.. క్లియర్‌గా చెప్పేసిన కెప్టెన్!


