మరో 79 పరుగులు చేస్తే రూట్‌ ప్రపంచ రికార్డు | England vs Pakistan: Joe Root On Cusp Of Breaking Ricky Ponting Huge World Record | Sakshi
Sakshi News home page

మరో 79 పరుగులు చేస్తే రూట్‌ ప్రపంచ రికార్డు

Aug 19 2026 1:06 PM | Updated on Aug 19 2026 1:08 PM

England vs Pakistan: Joe Root On Cusp Of Breaking Ricky Ponting Huge World Record

source: X

ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ ఓ భారీ ప్రపంచ రికార్డుపై కన్నేశాడు. పాకిస్తాన్‌తో ఇవాళ (ఆగస్ట్‌ 19) ప్రారంభ​ం కానున్న తొలి టెస్టులో అతడు 79 పరుగులు చేస్తే ఆస్ట్రేలియా దిగ్గజం రికీ పాంటింగ్ పేరిట ఉన్న హోమ్ టెస్టుల ప్రపంచ రికార్డును బద్దలు కొడతాడు.

స్వదేశంలో పాంటింగ్ 154 టెస్ట్‌ ఇన్నింగ్స్‌ల్లో 7,578 పరుగులు చేయగా.. రూట్‌ 153 ఇన్నింగ్స్‌ల్లో 7,500 పరుగులు చేశాడు. రూట్ పాంటింగ్‌ రికార్డును అధిగమించాలంటే మరో 79 పరుగులు మాత్రమే చేయాలి.

స్వదేశంలో అత్యధిక టెస్టు పరుగులు
1. రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా) – 7,578
2. జో రూట్ (ఇంగ్లండ్) – 7,500
3. సచిన్ టెండూల్కర్ (భారత్) – 7,216
4. మహేల జయవర్ధనే (శ్రీలంక) – 7,167
5. జాక్వెస్ కలిస్ (దక్షిణాఫ్రికా) – 7,035

మళ్లీ ఇంగ్లండ్ కెప్టెన్‌గా..!
బెన్ స్టోక్స్ రిటైర్మెంట్ తర్వాత జో రూట్ మరోసారి ఇంగ్లండ్ టెస్టు జట్టు పగ్గాలు చేపట్టాడు. 2017 నుంచి 2022 వరకు తొలిసారి కెప్టెన్‌గా వ్యవహరించిన రూట్ 65 టెస్టుల్లో 27 విజయాలు, 27 పరాజయాలు నమోదు చేశాడు.

రెండోసారి కెప్టెన్సీ దక్కడం తనకు ప్రత్యేకమైన అవకాశమని రూట్ చెప్పాడు. గత కెప్టెన్సీతో పోలిస్తే ఇప్పుడు తాను ఆటగాడిగా, వ్యక్తిగా ఎంతో మారానని తెలిపాడు. బెన్ స్టోక్స్, బ్రెండన్ మెకల్లమ్‌లతో కలిసి పనిచేయడం ద్వారా ఎంతో నేర్చుకున్నానని పేర్కొన్నాడు.

ఇదిలా ఉంటే, మూడు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ కోసం పాకిస్తాన్‌ జట్టు ఇంగ్లండ్‌లో పర్యటిస్తుంది. తొలి టెస్ట్‌ ఇవాళ హెడింగ్లే (లీడ్స్‌)లో ప్రారంభం కానుండగా.. రెండో టెస్ట్‌ లండన్‌ వేదికగా ఆగస్ట్‌ 27న, మూడో టెస్ట్‌ సెప్టెంబర్‌ 9న బర్మింగ్హమ్‌ వేదికగా ప్రారంభమవుతాయి. తొలి టెస్ట్‌ భారతకాలమానం ప్రకారం​ మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమవుతుంది.

తొలి టెస్ట్‌కు బాబర్‌ దూరం
ఈ మ్యాచ్‌కు పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజం దూరమయ్యాడు. తాజాగా ఇంగ్లండ్‌లోనే జరిగిన ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో అతడు గాయపడ్డాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో తొలి టెస్టులో ఆడటం లేదని ఆ జట్టు కోచ్ సర్ఫరాజ్ అహ్మద్ వెల్లడించాడు. బాబర్ స్థానంలో సల్మాన్ ఆఘా తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని తెలిపాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement