రాహుల్ దెబ్బ‌కు మైదానం వీడిన లంక ప్లేయర్‌! | KL Rahul-Wild Shot Injures Sri Lanka Star Nishan-Leaves-Field 1st Test | Sakshi
Sakshi News home page

SL Vs IND: రాహుల్ దెబ్బ‌కు మైదానం వీడిన లంక ప్లేయర్‌!

Aug 15 2026 1:06 PM | Updated on Aug 15 2026 1:20 PM

KL Rahul-Wild Shot Injures Sri Lanka Star Nishan-Leaves-Field 1st Test

Photo Credit: BCCI Twitter

గాలే వేదిక‌గా టీమిండియాతో జ‌రుగుతున్న తొలి టెస్టులో శ్రీలంక ఆట‌గాడు నిషాన్ మదుష్క గాయంతో మైదానం వీడడం క‌ల‌క‌లం రేపింది. టీమిండియా ఇన్నింగ్స్ 9వ ఓవ‌ర్లో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. ప్ర‌బాత్ జ‌య‌సూరియా వేసిన బంతిని కేఎల్ రాహుల్ స్వీప్ షాట్ ఆడే ప్ర‌య‌త్నంలో నిషాన్ మదుష్క మెడ భాగంలో బ‌లంగా త‌గిలింది. 

దీంతో మైదానంలో కింద‌ప‌డిపోయిన నిషాన్ వ‌ద్ద‌కు ఫిజియో ప‌రిగెత్తుకు వ‌చ్చారు. అయితే నిషాన్ మెడ‌పై బంతి తాకిన ప్ర‌దేశంలో వాపు రావ‌డంతో డాక‌ర్లు వెంట‌నే అత‌డిని పెవిలియ‌న్‌కు తీసుకెళ్లారు. ఆ త‌ర్వాత వైద్య ప‌రీక్ష‌ల కోసం ఆసుప‌త్రికి పంపించారు. దీంతో కంక‌ష‌న్‌కు గురైన నిషాన్ మదుష్క స్థానంలో సూరియాబండారా స‌బ్‌స్టిట్యూట్‌గా వ‌చ్చాడు. 

ఒక‌వేళ నిషాన్ మదుష్క గాయం తీవ్ర‌త ఎక్కువ‌గా ఉంటే మాత్రం తొలి టెస్టుకు అతడు దూర‌మ‌య్యే అవ‌కాశాలున్నాయి. అదే గనుక జ‌రిగితే నిషాన్ స్థానంలో సూరియా బండారా టెస్టు అరంగేట్రం చేయ‌నున్నాడు. ఒక‌వేళ మదుష్క దూర‌మైతే మాత్రం శ్రీలంక‌కు ఎదురుదెబ్బే అని చెప్పొచ్చు. 

ఇటీవ‌లే ఇండియా-ఏతో జ‌రిగిన అన‌ధికారిక మ్యాచ్‌లో ఆడిన నిషాన్ 4 ఇన్నింగ్స్‌లు కలిపి 256 ప‌రుగులు సాధించాడు. అంతేకాదు శ్రీలంక త‌ర‌ఫున టెస్టుల్లో 64.50 స‌గ‌టుతో ప‌రుగులు సాధించిన మదుష్క ఖాతాలో రెండు అర్ధ‌సెంచ‌రీలున్నాయి. గాయంతో నిషాన్ మదుష్క దూర‌మైతే అత‌డి స్థానంలో రానున్న ప‌సిందు సూరియ‌బండారా కూడా ఫ‌స్ట్‌క్లాస్ క్రికెట్‌లో మంచి రికార్డు క‌లిగి ఉన్నాడు. 54.36 స‌గ‌టుతో 4,893 ప‌రుగులు సాధించాడు.

ఇక మ్యాచ్ విషయానికొస్తే టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. వర్షం అంతరాయం కలిగించే సమయానికి టీమిండియా 27 ఓవర్లలో వికెట్ నష్టానికి 101 పరుగులు చేసింది. పడిక్కల్ (35), కేఎల్ రాహుల్ (32) పరుగులు చేశారు. అంతకముందు జైస్వాల్ (32) రాహుల్‌తో సమన్వయ లోపంతో రనౌట్‌గా వెనుదిరిగాడు.

Read: ఆరు వికెట్ల‌తో ఇరగదీశాడు.. ఆసీస్ బౌల‌ర్ అరుదైన ఫీట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement