ఇంగ్లండ్‌తో తొలి టెస్ట్‌కు ముందు పాక్‌కు భారీ షాక్‌ | Babar Azam Ruled Out Of Crucial Match On England Tour | Sakshi
Sakshi News home page

ఇంగ్లండ్‌తో తొలి టెస్ట్‌కు ముందు పాక్‌కు భారీ షాక్‌

Aug 15 2026 12:32 PM | Updated on Aug 15 2026 12:42 PM

Babar Azam Ruled Out Of Crucial Match On England Tour

source: X

ఇంగ్లండ్‌తో కీలకమైన టెస్ట్ సిరీస్‌కు ముందు పాకిస్తాన్‌కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ బ్యాటర్, కెప్టెన్ బాబర్ ఆజమ్ ప్రాక్టీస్ మ్యాచ్‌లో గాయపడ్డాడు. దీంతో ఆగస్టు 19న ప్రారంభమయ్యే తొలి టెస్టులో అతను ఆడటంపై అనుమానాలు నెలకొన్నాయి.

ప్రస్తుతం పాక్‌ Professional County Club Select XIతో మూడు రోజుల వార్మప్ మ్యాచ్ ఆడుతోంది. ఈ మ్యాచ్‌లో మానీ లమ్స్‌డెన్ వేసిన బంతి బాబర్ కింది చేతికి బలంగా తగిలింది. నొప్పితో ఇబ్బంది పడిన బాబర్ ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగలేదు.

బాబర్ గాయం తీవ్రతపై పాక్‌ క్రికెట్ బోర్డు అధికారిక ప్రకటన చేసింది. జట్టు వైద్యుడు పరీక్షించిన అనంతరం ముందు జాగ్రత్త చర్యగా మిగిలిన వార్మప్ మ్యాచ్‌కు బాబర్‌ను దూరంగా ఉంచాలని నిర్ణయించినట్లు తెలిపింది.

బాబర్ దూరమైతే..?
2025-27 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్ రేసులో నిలవాలంటే ఇంగ్లండ్‌పై మంచి ఫలితాలు సాధించడం పాకిస్తాన్‌కు కీలకం. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో పాక్‌ అట్టడుగు స్థానంలో ఉంది. బాబర్ పాక్‌కు అత్యంత కీలకమైన బ్యాటర్లలో ఒకడు. అతను తొలి టెస్టుకు పూర్తిగా ఫిట్‌గా లేకపోతే, జట్టు అతని విషయంలో ఎలాంటి రిస్క్ తీసుకోకపోవచ్చు.

ఈ పరిస్థితిలో షాన్ మసూద్ తిరిగి జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్టుకు గాయం కారణంగా దూరమైన మసూద్, బాబర్ స్థానంలో బ్యాటింగ్ ఆర్డర్‌లోకి రావచ్చు.

టాప్‌-10లోకి బాబర్‌
తాజాగా వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడిన బాబర్‌, రెండేళ్ల తర్వాత ఐసీసీ టెస్ట్‌ బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో టాప్‌-10లోకి వచ్చాడు. బాబర్‌ ఇంగ్లండ్‌ సిరీస్‌లోనూ ఫామ్‌ను కొనసాగించాలని పాక్‌ భావిస్తోంది. ఇలాంటి తరుణంలో అతడు గాయపడటంతో ఆ జట్టుకు ఇబ్బందవుతోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement