భారత బౌలర్ల విజృంభణ.. రెండో వికెట్ కోల్పోయిన లంక | Sri Lanka Vs India 1st Test Match Day 3 Live Score Updates And Highlights, India All Out For 462 And Sri Lanka Lose Early Wicket | Sakshi
Sakshi News home page

SL VS IND 1st Test: భారత బౌలర్ల విజృంభణ.. రెండో వికెట్ కోల్పోయిన లంక

Aug 17 2026 9:45 AM | Updated on Aug 17 2026 10:48 AM

Sri Lanka Vs India 1st Test Match-Day-3 Live Updates-Highlights-Galle

SL Vs IND 1st Test Day-3 Live Updates: గాలే వేదిక‌గా శ్రీలంక‌, భార‌త్ మ‌ధ్య‌ జ‌రుగుతున్న తొలి టెస్టు మూడో రోజు ఆట ప్రారంభమైంది..

రెండో వికెట్‌ డౌన్‌
తొలి టెస్టులో శ్రీలంక 27 పరుగుల వద్ద రెండో వికెట్‌ కోల్పోయింది. మానవ్‌ సుతార్‌ బౌలింగ్‌లో 4 పరుగులు చేసిన దినేశ్‌ చందిమల్‌ కీపర్‌ పంత్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం లంక 2 వికెట్ల నష్టానికి 31 పరుగులు చేసింది.

👉6 ఓవర్లు ముగిసేసరికి శ్రీలంక వికెట్‌ నష్టానికి 19 పరుగులు చేసింది. లాహిరు ఉడారా (10), చందిమల్‌ (4) క్రీజులో  ఉన్నారు.

తొలి వికెట్ కోల్పోయిన లంక
తమ ఇన్నింగ్స్‌ ఆరంభంలోనే శ్రీలంకకు షాక్ తగిలింది. సిరాజ్ బౌలింగ్‌లో ఓపెనర్ నిశాన్ ఫెర్నాండో డకౌట్ అయ్యాడు. అంతకముందు భార‌త్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 462 ప‌రుగుల‌కు ఆలౌటైంది. 460 ప‌రుగుల ఓవ‌ర్‌నైట్ స్కోరుకు మ‌రో రెండు ప‌రుగులు జోడించిన అనంత‌రం చివ‌రి వికెట్ కోల్పోయింది. దేవ‌దత్ ప‌డిక్క‌ల్ (167) సెంచ‌రీతో రాణించ‌గా, ఓపెన‌ర్ కేఎల్ రాహుల్ (82), ధ్రువ్ జురెల్ (51) అర్ధ‌శ‌త‌కాల‌తో మెరిశారు. లంక బౌలర్ల‌లో ప్ర‌బాత్ జ‌య‌సూరియా 4 వికెట్లు తీయ‌గా, కేషారా నువంతా 3, అశితా ఫెర్నాండో 2 వికెట్లు ప‌డ‌గొట్టాడు.

👉అయితే రెండో రోజు ఆట‌లో దాదాపు స‌గం వ‌ర్షార్పణ‌మ‌యింది. దీంతో 47 ఓవర్ల ఆట మాత్ర‌మే సాధ్య‌మైంది. అయితే మూడో రోజు మాత్రం ఉద‌యం నుంచి ఎండ కాస్తుండ‌డం శుభ ప‌రిణామం. అయితే మూడో రోజు నుంచి పిచ్ స్పిన్న‌ర్ల‌కు అనుకూలిస్తే మాత్రం బ్యాటింగ్ క‌ష్టంగా మారనుంది.

👉ఇక తొలి రోజు ప్రత్యర్థి బౌలర్లను సమర్థంగా ఎదుర్కొని మంచి పునాది వేసుకున్న టీమిండియా... రెండో రోజు దాన్ని మరింత బలపరుచుకుంది. ఓవర్‌నైట్‌ స్కోరు 288/2తో ఆదివారం తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన భారత్‌... రెండో రోజు ఆట ముగిసే సమయానికి 116 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 460 పరుగులు చేసింది. వర్షం కారణంగా రెండో రోజు 43 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యపడింది.

👉 సెంచరీ హీరో దేవదత్‌ పడిక్కల్‌ (230 బంతుల్లో 167; 15 ఫోర్లు, 1 సిక్స్‌) క్రితం రోజు స్కోరుకు మరో 36 పరుగులు జోడించి అవుట్‌ కాగా... ధ్రువ్‌ జురేల్‌ (68 బంతుల్లో 51; 4 ఫోర్లు, 1 సిక్స్‌) హాఫ్‌ సెంచరీతో మెరిశాడు. గాయం నుంచి కోలుకొని బ్యాటింగ్‌కు వచ్చిన కేఎల్‌ రాహుల్‌ (175 బంతుల్లో 82; 10 ఫోర్లు, 1 సిక్స్‌) మరో ఐదు పరుగులే చేశాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement