Photo Credit: Twitter
పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో తన రిటైర్మెంట్ విషయమై కీలక ప్రకటన చేశాడు. బహుశా ఈ ఏడాదే తన ఫుట్‌బాల్ కెరీర్‌కు ఎండ్‌కార్డ్ పడే అవకాశముందని రొనాల్డో స్పష్టం చేశాడు. ఆదివారం లైఫ్‌స్టైల్ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో రొనాల్డో తన రిటైర్మెంట్ ఎప్పుడనే దానిపై వివరణ ఇచ్చాడు.
"బహుశా నా ఫుట్‌బాల్ కెరీర్‌లో ఇదే చివరి సంవత్సరం కావొచ్చు. వచ్చే ఏడాదిలోగా ఆటకు రిటైర్మెంట్ ప్రకటించాలనుకుంటున్నా. నా భవిష్యత్తు గురించి నేను పూర్తిగా ప్రణాళిక వేసుకున్నాను. నన్ను తీరిక లేకుండా ఉంచే పనులు చాలా ఉన్నాయి, వాటిలో ఒక్క విషయం చెప్పడం కూడా కష్టం. ఎందుకంటే రిటైర్మెంట్ తర్వాత ఫుట్‌బాల్ లోటు నాలో ఒక పెద్ద శూన్యాన్ని సృష్టించగలదు.
అందుకే వీడ్కోలు తర్వాత సరదాగా గడపడం, ఎక్కువదూరం ప్రయణాలు చేయాలనుకుంటున్నా. ఎంతో ఇష్టమైన పాడెల్ ఆటను చూడడంతో పాటు జీవితంలో సంపాదించిన వ్యక్తులతో సంతోషంగా జీవించాలనుకుంటున్నా. 25 ఏళ్ల కెరీర్‌లో మిస్ అయినవన్నీ ఇప్పుడు తనివీతీరా ఆస్వాధించాలనుకుంటున్నా" అని చెప్పుకొచ్చాడు.
ఇక రొనాల్డో తన కెరీర్‌లో ఇప్పటివరకు 976 గోల్స్ సాధించాడు. 1000 గోల్స్ టార్గెట్‌గా పెట్టుకున్న రొనాల్డో ప్రస్తుతం సౌదీ ప్రో లీగ్ క్లబ్ అల్-నస్ర్ తరఫున ఆడుతున్నాడు. పోర్చుగల్ తరఫున రికార్డు స్థాయిలో ఆరు ఫిఫా ప్రపంచకప్‌లు ఆడినప్పటికీ జట్టుకు టైటిల్ అందించడంలో విఫలమయ్యాడు. అయినప్పటికీ 41 ఏళ్ల రొనాల్లోకు క్రేజ్ మాత్రం ఇసుమంతైనా తగ్గలేదు.
ఫిపా టైటిల్ గెలవనప్పటికీ తాను ఆడిన అన్ని ఫుట్‌బాల్ క్లబ్‌లను చాంపియన్‌గా నిలిపాడు. 2002లో ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ కెరీర్ ప్రారంభించినప్పటి నుంచి రొనాల్డో మాంచెస్టర్ యునైటెడ్, రియల్ మాడ్రిడ్, జువెంటస్, ప్రస్తుత అల్ నసర్ క్లబ్ దాకా అన్ని క్లబ్స్‌కు టైటిళ్లను అందించాడు.
అంతేకాదు ఐదుసార్లు ప్రతిష్టాత్మక బాలన్ డీ ఓర్ అవార్డును సొంతం చేసుకున్న రొనాల్డో కెరీర్‌లో పోర్చుగల్‌కు ఫిఫా టైటిల్ అందించలేదన్న లోటు మాత్రం అలాగే మిగిలిపోయింది. ఇక రొనాల్డో ఇటీవలే తన లాంగ్‌టైమ్ గర్ల్‌ఫ్రెండ్ జార్జినా రోడ్రిగ్జ్‌ను వివాహం చేసుకున్నాడు. దీంతో పదేళ్ల ప్రేమ ప్రయాణానికి ఫుల్‌స్టాప్ పెట్టిన ఈ జంట పెళ్లి బంధం ప్రయాణం ప్రారంభించింది.
🚨JUST IN: Cristiano Ronaldo has hinted at retirement:
“This will probably be my last year playing football” pic.twitter.com/DiEDFnRXBh— Polymarket Sports (@PolymarketSport) August 16, 2026


