భారత ఫుట్‌బాల్‌ జట్టు అద్భుత ప్రదర్శన | Football Friendly Match: India Secure Thrilling Draw vs World Cuppers Panama | Sakshi
Sakshi News home page

భారత ఫుట్‌బాల్‌ జట్టు అద్భుత ప్రదర్శన

Sep 26 2026 8:25 AM | Updated on Sep 26 2026 8:32 AM

Football Friendly Match: India Secure Thrilling Draw vs World Cuppers Panama

source: X

భారత ఫుట్‌బాల్‌ జట్టు అద్భుత ప్రదర్శన కనబర్చింది. బెంగళూరులోని శ్రీ కంఠీరవ స్టేడియంలో పనామాతో జరిగిన అంతర్జాతీయ ఫ్రెండ్లీ మ్యాచ్‌ను 1-1తో డ్రా చేసుకుంది. పనామా భారత్‌ కంటే చాలా మెరుగైన జట్టు. ఫిఫా ర్యాంకింగ్స్‌లో ఆ జట్టు 44వ స్థానంలో ఉండగా.. భారత్‌ 138వ ర్యాంక్‌లో ఉంది. పైగా పనామా ఫిఫా ప్రపంచకప్‌లో పాల్గొంది. 

తమకంటే అన్ని విభాగాల్లో చాలా మెరుగైన జట్టు కావడంతో ఈ మ్యాచ్‌ భారత్‌కు చాలా ప్రత్యేంగా నిలిచింది. ఈ మ్యాచ్‌ను డ్రా చేసుకోవడం భారత్‌కు ఘనతగా చెప్పుకోవాలి.

ఈ మ్యాచ్‌ ఆరంభం నుంచే భారత్‌ దూకుడుగా ఆడింది. రియాన్‌ విలియమ్స్‌ తొలి అర్ధభాగంలో గోల్‌ చేసి భారత్‌కు ఆధిక్యాన్ని అందించాడు. లాంగ్‌ పాస్‌ను అందుకున్న రియాన్‌ బాక్స్‌లోకి దూసుకెళ్లి గోల్‌కీపర్‌తో వన్‌-ఆన్‌-వన్‌ పరిస్థితిని సృష్టించాడు. అనంతరం ఎలాంటి తడబాటు లేకుండా బంతిని నెట్‌లోకి పంపి అద్భుతమైన గోల్‌గా మలిచాడు.

రెండో అర్ధభాగంలో పనామా పుంజుకుంది. ఒమర్‌ వాలెన్సియా అద్భుతమైన గోల్‌తో స్కోరును  సమం చేశాడు. బాక్స్‌ వెలుపల నుంచి ఎడమ కాలితో కొట్టిన అతడి షాట్‌ నేరుగా టాప్‌ కార్నర్‌లోకి దూసుకెళ్లింది. ఆ తర్వాత ఇరు జట్లు విజయం కోసం ఎంత ప్రయత్నించినా మరో గోల్‌ నమోదు కాలేదు. దీంతో మ్యాచ్‌ డ్రాగా ముగిసింది.

ఇదీ చదవండి: ఏషియన్‌ గేమ్స్‌ మారథాన్‌లో భారత్‌కు రతజం


 


 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement