source: X
భారత అథ్లెట్ సావన్ బర్వాల్ ఏషియన్ గేమ్స్ 2026 పురుషుల మారథాన్‌లో రజత పతకం సాధించాడు. 42.195 కిలోమీటర్ల రేసులో రెండో స్థానంలో నిలిచి, ఈ ఈవెంట్‌లో భారత్ 44 ఏళ్లుగా ఎదురుచూస్తున్న పతకాన్ని అందించాడు. జపాన్‌కు చెందిన ఇచితకా యమషితాకు ఈ ఈవెంట్‌లో స్వర్ణం లభించింది.
1982 ఏషియన్ గేమ్స్‌లో హోసూర్ కుక్కప్ప సీతారన్ కాంస్యం సాధించిన తర్వాత.. పురుషుల మారథాన్‌లో భారత్‌కు ఇదే తొలి పతకం. ఓవరాల్‌గా ఏషియన్ గేమ్స్ మారథాన్ చరిత్రలో భారత్‌కు ఇది నాలుగో పతకం. 1951 తొలి ఏషియన్ గేమ్స్‌లో ఛోటా సింగ్ స్వర్ణం, సూరత్ సింగ్ మాథుర్ కాంస్యం సాధించారు. 1982లో సీతారన్ మరో కాంస్యం అందించారు.
బర్వాల్ రజతంతో ప్రస్తుత ఏషియన్ గేమ్స్‌లో భారత్ పతకాల సంఖ్య 24కు చేరింది. పతకాల పట్టికలో భారత్ 12వ స్థానంలో కొనసాగుతుండగా.. చైనా 160 పతకాలతో అగ్రస్థానంలో దూసుకుపోతుంది.
ఇదీ చదవండి: 'గోల్డ్' తెచ్చిన 'గన్'


