నగోయా: ఆసియా క్రీడల్లో అరంగేట్రం చేస్తూనే చైనా టీనేజ్ స్విమ్మర్ జాంగ్ జాన్‌షువో రికార్డు పుటల్లోకి ఎక్కాడు. శుక్రవారం జరిగిన పురుషుల 400 మీటర్ల ఫ్రీస్టయిల్‌లో జాంగ్ స్వర్ణం సాధించాడు. దాంతో ఒకే ఆసియా క్రీడల్లో అత్యధికంగా 7 స్వర్ణాలు గెలిచిన క్రీడాకారుడిగా ఉత్తర కొరియా షూటర్ సో గిల్ సాన్ (1982 న్యూఢిల్లీలో 7 స్వర్ణాలు) పేరిట ఉన్న రికార్డును 19 ఏళ్ల జాంగ్ జాన్‌షువో సమం చేశాడు. అంతేకాకుండా ఒకే ఆసియా క్రీడల్లో అత్యధిక పసిడి పతకాలు గెలిచిన స్విమ్మర్‌గా రికార్డుసృష్టించాడు. తాజా గేమ్స్‌లో జాంగ్ 200, 400, 800, 1500 మీటర్ల ఫ్రీస్టయిల్ ఈవెంట్స్‌లో, 4్ఠ100 మీటర్ల రిలే, 4్ఠ200 మీటర్ల రిలే, 4్ఠ100 మీటర్ల రిలే ఈవెంట్లలో స్వర్ణ పతకాలు గెలిచాడు.


