విండీస్‌తో తొలి వన్డే.. భారత తుదిజట్టు అంచనా! | Nitish Reddy-In-India-Probable Playing XI Vs West Indies For 1st ODI | Sakshi
Sakshi News home page

IND Vs WI 1st ODI: విండీస్‌తో తొలి వన్డే.. భారత తుదిజట్టు అంచనా!

Sep 25 2026 8:01 PM | Updated on Sep 25 2026 9:33 PM

Nitish Reddy-In-India-Probable Playing XI Vs West Indies For 1st ODI

Photo Credit: BCCI Twitter

తిరువ‌నంత‌పురం వేదిక‌గా ఆదివారం భార‌త్‌, వెస్టిండీస్ మ‌ధ్య తొలి వ‌న్డే జ‌ర‌గ‌నుంది. ఈ నేప‌థ్యంలో భార‌త తుది జ‌ట్టులో ఎవ‌రు ఉంటారు, ఎవ‌రు ఉండ‌ర‌నే దానిపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ న‌డుస్తోంది. ఆసియా గేమ్స్‌లో పాల్గొనేందుకు శ్రేయ‌స్ అయ్య‌ర్ నేతృత్వంలోని భార‌త జ‌ట్టు జ‌పాన్‌కు రాగా, విండీస్‌తో వ‌న్డే సిరీస్‌కు రోహిత్‌, కోహ్లి, జ‌డేజా సిద్ధ‌మ‌య్యారు. వీరితో పాటు కెప్టెన్ గిల్‌, వైస్‌కెప్టెన్‌ కేఎల్ రాహుల్ ఆడ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో విండీస్‌తో తొలి వ‌న్డేకు తుదిజ‌ట్టు ఎలా ఉండ‌బోతుంద‌నేది ఒక‌సారి ప‌రిశీలిద్దాం.

తుదిజ‌ట్టులో యశస్వి జైస్వాల్, నమన్ ధీర్, ధ్రువ్ జురెల్‌ల‌కు అవ‌కాశం ద‌క్క‌డం క‌ష్ట‌మే. శ్రేయస్ అయ్యర్ స్థానంలో భారత జట్టులోకి వచ్చిన రుతురాజ్ గైక్వాడ్ మాత్రం ఆడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇక ఓపెన‌ర్లుగా రోహిత్ శర్మ, గిల్ రానున్నారు. వ‌న్‌డౌన్‌లో కోహ్లి, ఆ త‌ర్వాత రుతురాజ్ గైక్వాడ్ వ‌చ్చే అవ‌కాశ‌ముంది. ఇక ఐదో స్థానంలో వికెట్ కీప‌ర్ కేఎల్ రాహుల్ రానున్నాడు. 

ఆల్‌రౌండ‌ర్లుగా జ‌డేజా, నితీశ్‌కుమార్ రెడ్డి ఆడే అవ‌కాశ‌ముంది. జ‌ట్టులో ప్రధాన స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్ ఉండ‌వ‌చ్చు. ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో ప్రసిద్ధ కృష్ణ మహమ్మద్ సిరాజ్, గుర్నూర్ బ్రార్‌లు ఆడే అవ‌కాశ‌ముంది. ఈ సిరీస్ కోసం ఎంపిక చేసిన ఫాస్ట్ బౌలర్ ఆకిబ్ నబీ,  నమన్ ధిర్ బెంచ్‌కు ప‌రిమితం కానున్నారు.

భార‌త తుది జ‌ట్టు అంచ‌నా:
రోహిత్ శర్మ, శుబ్‌మ‌న్ గిల్‌, విరాట్ కోహ్లి, రుతురాజ్ గైక్వాడ్, కేఎల్ రాహుల్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, ప్రసిధ్‌ కృష్ణ, మహ్మద్ సిరాజ్, గుర్నూర్ బ్రార్.

ఇదీ చదవండి: భారత్‌తో తొలి వన్డే.. విండీస్ హెడ్‌కోచ్ సంచలన వ్యాఖ్యలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement