మానవ తప్పిదాలతోనే నీటి సంక్షోభం | India is facing a hidden groundwater crisis | Sakshi
Sakshi News home page

మానవ తప్పిదాలతోనే నీటి సంక్షోభం

Sep 26 2026 4:53 AM | Updated on Sep 26 2026 4:54 AM

India is facing a hidden groundwater crisis

భారత్‌లో తాగునీరు, భూగర్భ జలాల సంక్షోభం ఏకరూపంగా లేదు  

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ మార్పుల తీవ్రత, నదీజలాల కొరత స్పష్టంగా కనిపిస్తోంది... భూమిపై మంచినీటి వనరుల స్థితిగతులపై ఆందోళనకరమైన వాస్తవాలు వెలుగులోకి... 

నాసా, అంతర్జాతీయ పరిశోధకుల కొత్త హైరిజల్యూషన్‌ గ్లోబల్‌ మ్యాప్‌ ద్వారా వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: మానవ తప్పిదాలతోనే భూమిపై నీటి సంక్షోభం సంభవిస్తోందని..మంచినీటి వనరుల స్థితిగతులపై ఆందోళనకరమైన వాస్తవాలు వెల్లడయ్యాయి. నాసా –అంతర్జాతీయ పరిశోధకులు రూపొందించిన కొత్త గ్లోబల్‌ మ్యాప్‌..భూమిపై మానవ కార్యకలాపాల వల్ల విలువైన మంచి నీటి నిల్వలు ఎక్కడెక్కడ పెరిగాయి..ఎక్కడెక్కడ తగ్గాయో స్పష్టం చేసింది. భారతదేశం వంటి వ్యవసాయ ఆధారి త ప్రాంతాల్లో భూగర్భ జలాలు ప్రమాదకరంగా పడిపోవడానికి మానవ తప్పిదాలే కారణమని పేర్కొంది. నాసా, అంతర్జాతీయ పరిశోధకులు ఉమ్మడిగా విడుదల చేసిన ఒక కొత్త హైరిజల్యూషన్‌ గ్లోబల్‌ మ్యాప్‌ ద్వారా తాజాగా ఆందోళన కలిగించే అంశాలు వెలుగులోకి వచ్చాయి.

 నాసా గ్రేస్‌ శాటిలైట్ల ద్వారా సేకరించిన గురుత్వాకర్షణ డేటా ఆధారంగా ఈ మ్యాప్‌ను రూపొందించారు. భూగర్భ జలాల నిర్వహణలో తక్షణమే అంతర్జాతీయ విధానాలు మార్చుకోకపోతే, భవిష్యత్‌లో తాగునీటి సంక్షోభం యుద్ధాలకు దారితీసే ప్రమాదముందని ఈ నివేదిక హెచ్చరిస్తోంది. 2002–2025 మధ్య కాలానికి సంబంధించిన శాటిలైట్‌ డేటాను విశ్లేíÙంచి నివేదికను రూపొందించారు.అమెరికాకు చెందిన లైవ్‌ సైన్స్‌ ప్రచురించిన ఈ నివేదిక ప్రకారం.. పంటల సాగుకు అవసరానికి మించి భూగర్భ జలాలను తోడేస్తుండటంతో నీటి మట్టాలు ప్రమాదకర స్థాయికి పడిపోయాయి. 

భారత్‌ విషయానికొస్తే... 
భారత్‌లో తాగునీరు, భూగర్భ జలాల సంక్షోభం ఏకరూపంగా లేదు. భౌగోళిక పరిస్థితులు, పంటల సరళి, పట్టణీకరణ ఆధారంగా వివిధ రాష్ట్రాలపై దీని ప్రభావం విభిన్నంగా ఉంది. నిర్దిష్ట రాష్ట్రాలపై ఈ మంచినీటి క్షీణత ప్రభావం తీవ్రంగా ఉంది. తీవ్రమైన సంక్షోభంలో ఉన్న రాష్ట్రాలు (ఉత్తర, వాయవ్య భారతం)...ఈ ప్రాంతం ప్రపంచంలోనే అత్యధికంగా భూగర్భ జలాలను కోల్పోతున్న ‘హాట్‌స్పాట్‌’గా నాసా శాటిలైట్లు గుర్తించాయి. 

⇒ పంజాబ్, హరియాణాల విషయానికొస్తే... ఇక్కడి హరిత విప్లవ వ్యవసాయ నమూనా పూర్తిగా గొట్టపు బావులు, ఉచిత విద్యుత్‌పై ఆధారపడి ఉంది. వరి, గోధుమల వంటి ఎక్కువ నీరు అవసరమయ్యే పంటలను పండించడం వల్ల ఇక్కడ ఏటా 46 సెం.మీ వరకు భూగర్భ జలాలు పడిపోతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో బావులు ఎండిపోయి, తాగునీటికి కూడా ముప్పు ఏర్పడింది. 

⇒ రాజస్తాన్‌...ఎడారి ప్రాంతం కావడం, అస్థిరమైన రుతుపవనాల వల్ల ఇక్కడ మంచినీటి కొరత ఎప్పుడూ ఎక్కువే. అయితే, కొన్ని ఇసుకరాయి ఆక్విఫెర్ల వల్ల స్థానికంగా నీటి పునరుద్ధరణ (రీచార్జ్‌) జరుగుతున్నా, వ్యవసాయ పంపింగ్‌ కారణంగా నిల్వలు నిరంతరం తగ్గుతూనే ఉన్నాయి. 

⇒ ఉత్తర ప్రదేశ్‌... ముఖ్యంగా తూర్పు యూపీలో ఏటా దాదాపు 7 సెం.మీ చొప్పున భూగర్భ జలాలు తరిగిపోతున్నట్టు నాసా గ్రేస్‌ డేటా వెల్లడించింది 

తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే... 
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ మార్పుల తీవ్రత నదీజలాల కొరత స్పష్టంగా కనిపిస్తోంది. తెలంగాణలో చూస్తే..వర్షాభావ పరిస్థితులకు ఎల్‌నినో ప్రభావం తోడైనప్పుడు ఇక్కడ కరువు పరిస్థితులు ఏర్పడుతున్నాయి. నాగార్జునసాగర్, ఎల్లంపల్లి వంటి ప్రధాన జలాశయాల్లో నీటి మట్టాలు పడిపోయినప్పుడు హైదరాబాద్‌ వంటి నగరాలకు తాగునీటి సరఫరా కోసం డెడ్‌ స్టోరేజీలను వాడాల్సిన పరిస్థితి వస్తోంది 

⇒ ఆంధ్రప్రదేశ్‌... రాయలసీమ (ఉమ్మడి ప్రకాశం, పల్నాడు జిల్లాలు) వంటి ప్రాంతాల్లో భూగర్భ జలాలు పడిపోవడం వల్ల పత్తి, కంది, వేరుశనగ పంటలు ఎండిపోయే ప్రమాదం క్రమంగా పెరుగుతోంది. అయితే, గత దశాబ్ద కాలంలో కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వ జల సంరక్షణ చర్యల వల్ల స్వల్పంగా నీటి మట్టాలు పెరిగినట్టు నాసా గత అధ్యయనాలు చూపించాయి. కృష్ణా, గోదావరి పరీవాహక ప్రాంతాల్లో అకస్మాత్తుగా వచ్చే వరదలు స్థానిక నీటి లభ్యతను తాత్కాలికంగా పెంచుతున్నా, స్థిరమైన నిల్వలు కరువవుతున్నాయి 

ఆహార భద్రతకు ముప్పు. 
గోధుమలు, వరి, మొక్కజొన్న వంటి ప్రధాన పంటల దిగుబడి గణనీయంగా తగ్గుతుంది. నీటి సంక్షోభం ఇలాగే కొనసాగితే 2050 నాటికి భారతదేశ జీడీపీ లో 6% వరకు నష్టం వాటిల్లుతుందని ప్రపంచ బ్యాంక్‌ అంచనా వేసింది. 
⇒ రాష్ట్రాల మధ్య వివాదాలు: కృష్ణా, కావేరి వంటి నదీ జలాల పంపకాలపై రాష్ట్రాల మధ్య ఘర్షణలు మరింత తీవ్రమయ్యే ప్రమాదముంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement