'పంత్ వ‌ల్ల కాలేదు బ‌ట్ల‌ర్ సాధించాడు.. చాలా సంతోషం' | Sanjiv Goenka Celebrates Manchester Super Giants Maiden Hundred Title As LSG Struggles In IPL, Watch Video Went Viral | Sakshi
Sakshi News home page

'పంత్ వ‌ల్ల కాలేదు బ‌ట్ల‌ర్ సాధించాడు.. చాలా సంతోషం'

Aug 17 2026 9:16 AM | Updated on Aug 17 2026 10:58 AM

Sanjeev Goenka Reaction Viral-Manchester Super Giants Clinch Hundred Title

Photo Credit: Hundred Twitter

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌)లో  లక్నో సూపర్‌జెయింట్స్ ప్రయాణం మొదలై నాలుగేళ్లు అయినప్పటికీ టైటిల్ గెలవడంలో విఫలమైంది. కానీ హండ్రెడ్ లీగ్‌లో మాత్రం సంజీవ్ గోయెంకాకు చెందిన మాంచెస్ట‌ర్ సూప‌ర్‌జెయింట్స్ తాము ఆడుతున్న‌ తొలి సీజ‌న్‌లోనే టైటిల్ సాధించ‌డంతో అత‌డి ఆనందానికి అవ‌ధుల్లేకుండా పోయాయి. అత‌డి చ‌ర్య సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారడంతో సంజీవ్ గోయెంకా మ‌రోసారి వార్త‌ల్లో నిలిచాడు. 

‘‘మా తొలి సీజ‌న్‌లోనే మేము చాంపియ‌న్స్‌గా నిలిచాం. కంగ్రాట్స్ మాంచెస్ట‌ర్ సూప‌ర్‌జెయింట్స్‌. లార్డ్స్ వేదిక‌గా జ‌రిగిన ఫైన‌ల్లో మాంచెస్ట‌ర్ సాధించిన ఈ అద్భుత విజ‌యాన్ని ఎప్ప‌టికీ మ‌రిచిపోలేం. ఈ విజ‌యం మా సూప‌ర్‌జెయింట్స్ ఫ్యామిలీకి గ‌ర్వ‌కార‌ణం. జ‌ట్టు స‌మిష్టి కృషితోనే ఈ విజ‌యం సాధ్య‌మైంది. టిమ్ సీఫెర్ట్ నిజంగా అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. 

ఇక నూర్ అహ్మద్ త‌న అద్భుత బౌలింగ్‌తో వికెట్లు ప‌డ‌గొట్టి టైటిల్ గెల‌వ‌డంలో ప్ర‌ధానపాత్ర పోషించాడు. జోస్ బ‌ట్ల‌ర్ కెప్టెన్‌గా జ‌ట్టును ముందుండి న‌డిపించ‌డ‌మే గాక అంద‌రిని క‌లుపుకుపోయి స‌మిష్టిగా రాణించి టైటిల్ అందించ‌డంలో విజ‌య‌వంత‌మయ్యాడు. జోస్‌తో పాటు ప్ర‌తీ ఆట‌గాడికి నా ప్ర‌త్యేక అభినంద‌న‌లు. మాకు మ‌ద్ద‌తుగా నిలిచిన ప్ర‌తీ ఒక్క‌రికి పేరు పేరునా ధ‌న్య‌వాదాలు’’ అని గోయెంకా ముగించాడు.

మాంచెస్ట‌ర్ సూప‌ర్ జెయింట్స్ గ‌తంలో మాంచెస్ట‌ర్ ఒరిజిన‌ల్స్ పేరుతో హండ్రెడ్ టోర్నీ ఆడింది. అయితే 2025లో జ‌ట్టు అమ్మ‌కానికి వ‌చ్చిన‌ప్పుడు సంజీవ్ గోయెంకా 70శాతం పెట్టుబ‌డి పెట్ట‌డంతో జ‌ట్టు కాస్తా మాంచెస్ట‌ర్ సూప‌ర్‌జెయింట్స్‌గా మారిపోయింది. లంకాషైర్‌ వాటా 30 శాతంగా ఉంది.

ఇక ఐపీఎల్ 2022 సీజ‌న్‌లో ఎంట్రీ ఇచ్చిన‌ ల‌క్నో సూప‌ర్‌జెయింట్స్ కేఎల్ రాహుల్ కెప్టెన్సీలో మంచి ప్రదర్శన చేసింది. తొలి రెండు సీజన్లలో ల‌క్నో ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టింది. ఆ త‌ర్వాత కేఎల్ రాహుల్‌తో విబేధాలు రావ‌డంతో అత‌డిని వ‌దులుకుంది. రూ. 27 కోట్ల రికార్డు ధ‌ర‌కు పంత్‌ను కొనుగోలు చేసిన ల‌క్నో సూప‌ర్‌జెయింట్స్ అత‌డికే కెప్టెన్సీ ప‌గ్గాలు అప్ప‌గించింది. 

కానీ పంత్ సార‌థ్యంలో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ 2025, 2026 సీజ‌న్ల‌లో దారుణ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచింది. క‌నీసం ప్లే ఆఫ్స్ చేర‌డంలో కూడా ల‌క్నో విఫ‌ల‌మైంది. దీంతో పంత్ ఓట‌మికి బాధ్య‌త వ‌హిస్తూ కెప్టెన్సీ ప‌ద‌వికి రాజీనామా కూడా చేశాడు. వ‌చ్చే సీజ‌న్‌లో పంత్ స్థానంలో ఎవ‌రు కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రిస్తార‌నేది చూడాలి.

 

Read: బాంబు పేల్చిన రొనాల్డో.. షాక్‌లో అభిమానులు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement