breaking news
Manchester Super Giants
-
'పంత్ వల్ల కాలేదు బట్లర్ సాధించాడు.. చాలా సంతోషం'
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో లక్నో సూపర్‌జెయింట్స్ ప్రయాణం మొదలై నాలుగేళ్లు అయినప్పటికీ టైటిల్ గెలవడంలో విఫలమైంది. కానీ హండ్రెడ్ లీగ్‌లో మాత్రం సంజీవ్ గోయెంకాకు చెందిన మాంచెస్టర్ సూపర్‌జెయింట్స్ తాము ఆడుతున్న తొలి సీజన్లోనే టైటిల్ సాధించడంతో అతడి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. అతడి చర్య సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో సంజీవ్ గోయెంకా మరోసారి వార్తల్లో నిలిచాడు. ‘‘మా తొలి సీజన్లోనే మేము చాంపియన్స్‌గా నిలిచాం. కంగ్రాట్స్ మాంచెస్టర్ సూపర్‌జెయింట్స్. లార్డ్స్ వేదికగా జరిగిన ఫైనల్లో మాంచెస్టర్ సాధించిన ఈ అద్భుత విజయాన్ని ఎప్పటికీ మరిచిపోలేం. ఈ విజయం మా సూపర్‌జెయింట్స్ ఫ్యామిలీకి గర్వకారణం. జట్టు సమిష్టి కృషితోనే ఈ విజయం సాధ్యమైంది. టిమ్ సీఫెర్ట్ నిజంగా అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఇక నూర్ అహ్మద్ తన అద్భుత బౌలింగ్‌తో వికెట్లు పడగొట్టి టైటిల్ గెలవడంలో ప్రధానపాత్ర పోషించాడు. జోస్ బట్లర్ కెప్టెన్‌గా జట్టును ముందుండి నడిపించడమే గాక అందరిని కలుపుకుపోయి సమిష్టిగా రాణించి టైటిల్ అందించడంలో విజయవంతమయ్యాడు. జోస్‌తో పాటు ప్రతీ ఆటగాడికి నా ప్రత్యేక అభినందనలు. మాకు మద్దతుగా నిలిచిన ప్రతీ ఒక్కరికి పేరు పేరునా ధన్యవాదాలు’’ అని గోయెంకా ముగించాడు.మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ గతంలో మాంచెస్టర్ ఒరిజినల్స్ పేరుతో హండ్రెడ్ టోర్నీ ఆడింది. అయితే 2025లో జట్టు అమ్మకానికి వచ్చినప్పుడు సంజీవ్ గోయెంకా 70శాతం పెట్టుబడి పెట్టడంతో జట్టు కాస్తా మాంచెస్టర్ సూపర్‌జెయింట్స్‌గా మారిపోయింది. లంకాషైర్ వాటా 30 శాతంగా ఉంది.ఇక ఐపీఎల్ 2022 సీజన్లో ఎంట్రీ ఇచ్చిన లక్నో సూపర్‌జెయింట్స్ కేఎల్ రాహుల్ కెప్టెన్సీలో మంచి ప్రదర్శన చేసింది. తొలి రెండు సీజన్లలో లక్నో ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టింది. ఆ తర్వాత కేఎల్ రాహుల్‌తో విబేధాలు రావడంతో అతడిని వదులుకుంది. రూ. 27 కోట్ల రికార్డు ధరకు పంత్‌ను కొనుగోలు చేసిన లక్నో సూపర్‌జెయింట్స్ అతడికే కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది. కానీ పంత్ సారథ్యంలో లక్నో సూపర్ జెయింట్స్ 2025, 2026 సీజన్లలో దారుణ ప్రదర్శన కనబరిచింది. కనీసం ప్లే ఆఫ్స్ చేరడంలో కూడా లక్నో విఫలమైంది. దీంతో పంత్ ఓటమికి బాధ్యత వహిస్తూ కెప్టెన్సీ పదవికి రాజీనామా కూడా చేశాడు. వచ్చే సీజన్లో పంత్ స్థానంలో ఎవరు కెప్టెన్‌గా వ్యవహరిస్తారనేది చూడాలి.Sanjiv Goenka used to thank God for every win, now his team won the championship finally in cricket.🏆Congratulations to @DrSanjivGoenka and Manchester Super Giants🎉🎊 pic.twitter.com/qeZNY2U8Sn— कट्टर INDIA समर्थक 🦁🇮🇳 ™ (@KKRWeRule) August 16, 2026 Manchester Super Giants Clinch Maiden Hundred Title, Owner Sanjiv Goenka's Reaction Goes Viral#SanjivGoenka #ManchesterSuperGiants #Hundred https://t.co/k804UhYLHU pic.twitter.com/QxU6W8ILnd— NDTV Sports (@Sports_NDTV) August 17, 2026Read: బాంబు పేల్చిన రొనాల్డో.. షాక్‌లో అభిమానులు! -
కివీస్ బ్యాటర్ వన్‌మ్యాన్ షో.. బట్లర్ సేనదే హండ్రెడ్ టైటిల్
హండ్రెడ్ మెన్స్ కాంపిటీషన్ 2026 విజేతగా మాంచెస్టర్ సూపర్‌జెయింట్స్ నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్ పోరులో ట్రెంట్ రాకెట్స్‌పై 5 వికెట్ల తేడాతో మాంచెస్టర్ సూపర్‌జెయింట్స్ విజయం సాధించింది. టిమ్ సీఫెర్ట్ విధ్వంసంతో టార్గెట్‌ను ఈజీగా అందుకున్న సూపర్‌జెయింట్స్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. 159 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సూపర్‌జెయింట్స్ 98 బంతుల్లోనే 5 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను అందుకుంది. టిమ్ సీఫెర్ట్ (38 బంతుల్లో 72; 4 ఫోర్లు, 7 సిక్సర్లు) సంచలన ఇన్నింగ్స్ ఆడగా, చివర్లో లూస్ డు ప్లూయ్ (27 నాటౌట్), కెప్టెన్ జాస్ బట్లర్ (23) రాణించారు. ట్రెంట్ రాకెట్స్ బౌలర్లలో మొహమ్మద్ ఆమిర్ 3 వికెట్లు తీయగా, క్లావిన్ హారిసన్ 2 వికెట్లు పడగొట్టాడు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ట్రెంట్ రాకెట్స్ 100 బంతుల్లో 8 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. అనెరిన్ డొనాల్డ్ (38) టాప్ స్కోరర్‌గా నిలవగా, లూయిస్ జార్జరీ (32), బెన్ డకెట్ (31) పర్వాలేదనిపించారు. సూపర్‌జెయింట్స్ బౌలర్లలో నూర్ అమ్మద్ 3 వికెట్లు తీయగా, సొన్ని బేకర్ 2 వికెట్లు పడగొట్టాడు. హాఫ్ సెంచరీతో అదరగొట్టిన టిమ్ సీఫెర్ట్ 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'తో పాటు 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ' (394 పరుగులు) సొంతం చేసుకున్నాడు. ఇక బట్లర్ సేనకు ఇదే తొలి హండ్రెడ్ టైటిల్ కావడం విశేషం. అంతేకాదు హండ్రెడ్ చరిత్రలో ఐదు ఫిఫ్టీలో బాదిన తొలి క్రికెటర్‌గా టిమ్ సీఫెర్ట్ రికార్డులకెక్కాడు.ట్రెంట్ రాకెట్స్‌కు మెయిడెన్ టైటిల్మరోవైపు హండ్రెడ్ వుమెన్స్ విజేతగా ట్రెంట్ రాకెట్స్ నిలిచింది. సన్‌రైజర్స్ లీడ్స్ వుమెన్‌తో జరిగిన ఫైనల్లో ట్రెంట్ రాకెట్స్ 8 వికెట్ల తేడాతో నెగ్గి తొలిసారి చాంపియన్స్‌గా నిలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ లీడ్స్ 91 పరుగులకే కుప్పకూలింది. అనాబెల్ సదర్లాండ్ (25 పరుగులు) టాప్ స్కోరర్‌గా నిలవగా, డాని గిబ్సన్ 22 పరుగులతో పర్వాలేదనిపించింది. ట్రెంట్ బౌలర్లలో కిమ్ గార్త్, సమంతా బేట్స్, చార్లీ ఫిలిప్స్, జార్జియా ఆడమ్స్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం ట్రెంట్ రాకెట్స్ మరో 46 బంతులు మిగిలి ఉండగానే రెండు వికెట్లు కోల్పోయి 92 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. ఓపెనర్లు సోఫియా డంక్లే (41) రాణించగా.. బెత్ మూనీ (31 నాటౌట్) ఆఖరి వరకు నిలిచి జట్టును గెలిపించింది. జార్జియా ఆడమ్స్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, అన్నాబెల్ సదర్లాండ్ (315 పరుగులు, 11 వికెట్లు) ప్లేయర్ ఆఫ్ సిరీస్ అవార్డు గెలుచుకున్నారు.We were all Jos Buttler watching that finish 🫣#TheHundredFinal pic.twitter.com/w06H16zE0z— The Hundred (@thehundred) August 16, 2026Five fifties in 10 innings for Tim Seifert in this year's Hundred 🔥pic.twitter.com/XFTJa0GeZV— Cricinfo (@cricinfo) August 16, 2026చదవండి: 'సాకులు వెతుక్కోను.. మా ఓటమికి కారణమదే'


