Photo Credit: Twitter
టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో శ్రీలంకకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. టీమిండియా రెండో ఇన్నింగ్స్ సమయంలో బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న ఆ జట్టు ఆటగాడు దినేశ్ చందిమల్ గాయానికి గురయ్యాడు. ఇన్నింగ్స్ 4వ ఓవర్లో కేఎల్ రాహుల్ ఆడిన స్వీప్‌షాట్‌ను అడ్డుకునే ప్రయత్నంలో బౌండరీ లైన వద్ద ఉన్న రోప్ అడ్డుతగలడంతో అతడి మెడ బాగానికి గాయమైంది.
దీంతో ఫిజియో వచ్చి చందిమల్‌ను పరీక్షించారు. నొప్పితో బాధపడుతున్న చందిమల్‌ను తదుపరి స్కానింగ్‌ల కోసం ఆసుపత్రికి తరలించారు. అతడి స్థానంలో పసిందు సూరియబండారా సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌గాఆ వచ్చాడు. తాజా గాయంతో లంక రెండో ఇన్నింగ్స్ సమయంలో చందిమల్ బ్యాటింగ్‌కు వస్తాడా రాడా అనేది అనుమానంగా మారింది.
‘‘నాలుగో రోజు తొలి సెషన్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా బౌండరీని ఆపేందుకు డైవ్ చేసినప్పుడు దినేష్ చండిమాల్ కుడి భుజానికి, మెడకు గాయమైంది. మైదానంలోనే జట్టు ఫిజియోథెరపిస్ట్, వైద్యులు అతడిని పరీక్షించారు. ముందుజాగ్రత్తగా స్కానింగ్ కోసం ఆసుపత్రికి తరలించారు. స్కానింగ్ ఫలితాలు వచ్చిన తర్వాత మరిన్ని వివరాలు తెలియజేస్తాం’’ అని శ్రీలంక క్రికెట్ బోర్డు (ఎస్‌ఎల్‌సి) తెలిపింది.
నాలుగో ఇన్నింగ్స్ సమయానికి చందిమల్ కోలుకోకపోతే మాత్రం శ్రీలంకకు గట్టి ఎదురుదెబ్బే అని చెప్పొచ్చు. ఎందుకంటే చందిమల్ దూరమైతే అప్పుడు లంక జట్టు 10 మందితోనే ఆడాల్సి ఉంటుంది. మరోవైపు లంక సీనియర్ బ్యాటర్ అయిన చందిమల్‌కు భారత్‌పై మంచి రికార్డు ఉంది. టీమిండియాపై 9 టెస్టులాడిన చందిమల్ 754 పరుగులు సాధించాడు. ఇందులో రెండు శతకాలు, మూడు అర్ధసెంచరీలున్నాయి.
ఇక టీమిండియా తొలి టెస్టులో పట్టు బిగించిన సంగతి తెలిసిందే. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 462 పరుగులకు ఆలౌట్ కాగా, శ్రీలంక 284 పరుగుల వద్ద ఇన్నింగ్స్ ముగించడంతో భారత్‌కు 178 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన టీమిండియా వేగంగా ఆడి లంక ఎదుట భారీ టార్గెట్‌ను నిర్దేశించాలని భావిస్తోంది. ఆటకు మరో రోజు సమయం మిగిలి ఉంది.
Sri Lanka batter Dinesh Chandimal has been taken to the hospital for a precautionary scan after injuring his right shoulder and neck while diving to save a boundary on day four of the first Test against India at the Galle International Stadium on Tuesday.
"Dinesh Chandimal… pic.twitter.com/30cqMwPpcY— IANS (@ians_india) August 18, 2026


