Photo Credit: BCCI Twitter
శ్రీలంకతో గాలే వేదికగా జరగనున్న తొలి టెస్టుకు టీమిండియా ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గాలే పిచ్ తొలి రెండు రోజులు బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుందని, ఆ తర్వాతి మూడు రోజులు స్పిన్నర్లకు ఉపయుక్తంగా ఉంటుందని పిచ్ రిపోర్ట్ నివేదికలు వెల్లడిస్తున్నాయి. మ్యాచ్‌కు ఒక్కరోజు మాత్రమే మిగిలిఉన్నప్పటికీ, తుదిజట్టు ఇంకా ఖరారు కాలేదు.
గాలే పిచ్ పరిస్థితులను బట్టి ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగాలని టీమిండియా మేనేజ్‌మెంట్ యోచిస్తోంది. ఈ లెక్కన కుల్దీప్ యాదవ్‌తో పాటు రవీంద్ర జడేజా, మానవ్ సుతార్ లేదా సారాంశ్ జైన్‌లో ఒకరు స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా చోటు దక్కించుకోనున్నారు. ఇక సిరాజ్, గుర్నూర్ బ్రార్ లేదా ప్రసిధ్ క్రిష్ణలు పేస్ బాధ్యతలను పంచుకోనున్నారు.
ఇక బ్యాటింగ్ విభాగంలో తొలి ఐదు స్థానాల్లో (జైస్వాల్, కేఎల్ రాహుల్, పడిక్కల్, గిల్, పంత్) ఎలాంటి మార్పు లేనప్పటికీ, ఆరో స్థానంపై తెగ చర్చ నడుస్తోంది. ఆరో స్థానంలో జురెల్ లేదా సర్ఫరాజ్‌ల్లో ఒకరికే చాన్స్ ఇవ్వాలని బీసీసీఐ భావిస్తోంది. అయితే సీనియార్టీ ప్రకారం జురెల్ కంటే సర్ఫరాజ్ వైపే మేనేజ్‌మెంట్ మొగ్గు చూపనున్నట్లు తెలుస్తోంది. దీంతో సర్ఫరాజ్ లంకతో తొలి టెస్టులో ఆడడం దాదాపు ఖాయమైనట్లే.
టీమిండియా ప్లేయింగ్ ఎలెవెన్: జైస్వాల్, కేఎల్ రాహుల్, దేవద్ పడిక్కల్, గిల్ (కెప్టెన్), పంత్ ( వికెట్ కీపర్), సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్/సారాంశ్, సిరాజ్, గుర్నూర్/ప్రసిధ్ క్రిష్ణ.
🚨 NOT A TURNER ❌
- Galle pitch is likely to be batting friendly in first 2 days. [Sahil Malhotra from TOI]
India likely to field 2 quicks & 3 spinners for depth and balance. pic.twitter.com/vx6k5h5aLy— Johns. (@CricCrazyJohns) August 14, 2026


