SL Vs IND 1st Test Day-4 Updates: గాలే వేదికగా శ్రీలంక, భారత్ మధ్య తొలి టెస్టు నాలుగో రోజు ఆట ప్రారంభమైంది. రెండో ఇన్నింగ్స్‌లో 193 పరుగులకు ఆలౌటైన టీమిండియా.. శ్రీలంకకు 372 పరుగుల టార్గెట్ విధించింది.
గెలుపునకు 6 వికెట్ల దూరంలో భారత్
శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో భారత్ గెలుపునకు 6 వికెట్ల దూరంలో ఉంది. 372 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో శ్రీలంక నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 84 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక గెలవాలంటే చివరి రోజు 288 పరుగులు చేయాలి.
ఇది అంతా సులువుగా జరిగే పని కాదు. భారత్ మాత్రం మరో 6 వికెట్లు తీస్తే విజయం సొంతం చేసుకుంటుంది. అయితే చివరి రోజు భారత గెలుపుకు వరుణుడు ఆటంకం కలిగించే అవకాశం ఉంది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో సోనల్ దినుష (25), కెప్టెన్ ధనంజయ డిసిల్వ (31) క్రీజ్‌లో ఉన్నారు.
నాలుగో వికెట్ కోల్పోయిన శ్రీలంక
21.4 ఓవర్: మానవ్ సుతార్ బౌలింగ్‌లో జురెల్‌కు క్యాచ్ ఇచ్చి నాలుగో వికెట్‌గా వెనుదిరిగిన లాహిరు ఉదార (16). శ్రీలంక స్కోరు: 47-4. సొనాల్ దినుష క్రీజులోకి రాగా.. ధనంజయ 19 పరుగులతో ఉన్నాడు.
15 ఓవర్లలో శ్రీలంక స్కోరు: 33-3
ఉదార 15, ధనంజయ 7 పరుగులతో ఉన్నారు. విజయానికి 339 పరుగుల దూరంలో శ్రీలంక.
మూడో వికెట్ కోల్పోయిన శ్రీలంక
10.4 ఓవర్: ప్రసిద్ కృష్ణ బౌలింగ్‌లో కేఎల్ రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి నిష్క్రమించిన కమిందు మెండిస్. రెండు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటైన కమిందు. లంక స్కోరు: 21-3. ఉదార 11 పరుగులతో ఉండగా.. కెప్టెన్ ధనంజయ డి సిల్వ క్రీజులోకి వచ్చాడు.
రెండో వికెట్ కోల్పోయిన శ్రీలంక
7.2 ఓవర్: మానవ్ సుతార్ బౌలింగ్‌లో లెగ్ బిఫోర్ వికెట్‌గా పెవిలియన్ చేరిన పసిందు. అరంగేట్రంలోనే డకౌట్‌గా పసిందు. లంక స్కోరు 14-2. ఉదార 6 పరుగులతో ఉండగా.. కమిందు మెండిస్ క్రీజులోకి వచ్చాడు.
తొలి వికెట్ కోల్పోయిన శ్రీలంక
6.6: సిరాజ్ బౌలింగ్‌లో ప్రసిద్‌కు క్యాచ్ ఇచ్చి తొలి వికెట్‌గా వెనుదిరిగిన నిశాన్ మధుష్క (6). లంక స్కోరు 13-1 (7). విజయానికి ఇంకా 359 పరుగులు కావాలి. ఉదార 5 పరుగులతో ఉండగా.. పసిందు సూరియబండారా క్రీజులోకి వచ్చాడు.
లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంక
ఆరు ఓవర్లలో స్కోరు: 12-0
ఉదార 4, నిశాన్ 6 పరుగులతో ఉన్నారు. విజయానికి ఇంకా 360 పరుగులు కావాలి.
వర్షం వల్ల అంతరాయం
శ్రీలంక లక్ష్య ఛేదనకు దిగాల్సి ఉండగా.. వాన వల్ల అంతరాయం కలిగింది
193 పరుగులకు ఆలౌటైన టీమిండియా
భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 193 పరుగులకు ఆలౌటైంది. తద్వారా శ్రీలంక ముందు 372 పరుగుల టార్గెట్‌ను ఉంచింది.
తొమ్మిదో వికెట్ కోల్పోయిన భారత్
190 పరుగుల వద్ద భారత్ తొమ్మిదో వికెట్ కోల్పోయింది. ప్రభాత్ జయసూర్య బౌలింగ్‌లో ధనంజయ డిసిల్వకు క్యాచ్ ఇచ్చి కుల్దీప్ యాదవ్ (5) ఔటయ్యాడు.
ఎనిమిదో వికెట్ కోల్పోయిన భారత్
188 పరుగుల వద్ద భారత్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. అశిత ఫెర్నాండో బౌలింగ్‌లో డిక్వెల్లాకు క్యాచ్ ఇచ్చి మానవ్ సుతార్ (9) ఔటయ్యాడు.
9 పరుగులు చేసిన జడేజాను లాహిరు కుమారా పెవిలియన్ చేర్చడంతో భారత్ ఏడో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం భారత్ ఆధిక్యం 357 పరుగులుగా ఉంది.
పంత్ (66) ఔట్
66 పరుగులు చేసిన పంత్ కుమారా బౌలింగ్‌లో డిక్వెల్లాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరగడంతో టీమిండియా 174 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం భారత్ ఆధిక్యం 352 పరుగులుగా ఉంది.
సిక్సర్‌తో ఫిఫ్టీ పూర్తి చేసుకున్న పంత్
లాహిరు కుమారా బౌలింగ్‌లో భారీ సిక్సర్ కొట్టిన పంత్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 54 బంతుల్లో ఫిఫ్టీ మార్క్ అందుకున్న పంత్ ఇన్నింగ్స్‌లో ఆరు ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. ప్రస్తుతం భారత్ 5 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. భారత్ ఆధిక్యం 336 పరుగులు.
36 ఓవర్లలో టీమిండియా స్కోరు 151-5
పంత్ 47, జడేజా 4 పరుగులతో ఉన్నారు. భారత్ ఆధిక్యం 329 పరుగులు.
ఐదో వికెట్ కోల్పోయిన టీమిండియా
అసితా ఫెర్నాండో బౌలింగ్‌లో నిరోషన్ డిక్‌విల్లాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరిన ధ్రువ్ జురెల్ (7). క్రీజులోకి వచ్చిన రవీంద్ర జడేజా. టీమిండియా స్కోరు 120-5 (31). పంత్ 23 పరుగులతో ఉన్నాడు.
లంచ్ తర్వాత మొదలైన ఆట
లంచ్ విరామం
గాలే టెస్టులో భాగంగా నాలుగో రోజు ఆటలో లంచ్ విరామ సమయానికి టీమిండియా తమ రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది. రిషబ్ పంత్ (21), ధ్రువ్ జురెల్ (5) పరుగులతో క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం భారత్ 294 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. తొలి ఇన్నింగ్స్‌లో రాణించిన పడిక్కల్ (44) మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడగా, రాహుల్ (35) పర్వాలేదనిపించాడు. లంక బౌలర్లలో ప్రబాత్ జయసూరియా 2 వికెట్లు తీయగా, కెషారా, అశితా ఫెర్నాండో చెరో వికెట్ పడగొట్టారు.
పడిక్కల్ ఔట్.. నాలుగో వికెట్ డౌన్
టీమిండియా తమ రెండో ఇన్నింగ్స్‌లో తడబడుతోంది. వేగంగా ఆడే ప్రయత్నంలో వికెట్లు చేజార్చుకుంటుంది. తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో పడిక్కల్ 44 పరుగుల వద్ద కెషారా నువంతా బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. దీంతో భారత్ 111 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం భారత్ 289 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.
మూడో వికెట్ కోల్పోయిన టీమిండియా
ఇన్నింగ్స్ 21వ ఓవర్లో శుబ్‌మన్ గిల్ (8) రూపంలో టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం భారత్ 3 వికెట్ల నష్టానికి 82 పరుగులు చేసింది. పడిక్కల్ (35), పంత్ (1) పరుగుతో ఆడుతున్నారు.
రెండో వికెట్ డౌన్
65 పరుగుల వద్ద కేఎల్ రాహుల్ (35) రూపంలో భారత్ రెండో వికెట్ కోల్పోయింది. ప్రబాత్ జయసూరియా బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించిన రాహుల్ మిలన్ రత్ననాయకేకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం భారత్ 243 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.
ఫిఫ్టీ మార్క్ దాటిన టీమిండియా
రెండో ఇన్నింగ్స్‌లో 14 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా వికెట్ నష్టానికి 59 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ 30, పడిక్కల్ 29 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇప్పటివరకు భారత్ 237 పరుగుల ఆధిక్యంలో ఉంది.

తొలి వికెట్ డౌన్
గాలే వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో 178 పరుగుల ఆధిక్యంతో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. అశితా ఫెర్నాండో బౌలింగ్‌లో ఓపెనర్ యశస్వి జైస్వాల్ డకౌట్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం టీమిండియా వికెట్ నష్టానికి 9 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (1), పడిక్కల్ (10) పరుగులతో క్రీజులో ఉన్నారు.
అంతకముందు శ్రీలంక తమ తొలి ఇన్నింగ్స్‌లో 284 పరుగులకు ఆలౌటైంది. దినూష (100) శతకంతో రాణించగా, నిరోషన్ డిక్‌వెల్లా (80) అర్ధసెంచరీ చేశాడు. ఒకదశలో లంక 90/5 వద్ద కష్టాల్లో ఉండగా వీరిద్దరు ఆరో వికెట్‌కు 36.1 ఓవర్లలో 146 పరుగులు జోడించి జట్టును ఆదుకున్నారు. భారత బౌలర్లలో మానవ్ సుతార్‌కు 4, జడేజాకు 3 వికెట్లు దక్కాయి.
భారత్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 13 ఓవర్లు ఆడాల్సి ఉన్నా... వెలుతురులేమి వల్ల ఆట సాధ్యం కాలేదు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 460/9తో మూడో రోజు ఆట కొనసాగించిన భారత్ మరో 4 బంతులాడి తొలి ఇన్నింగ్స్‌లో 462 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే.


