క్రికెట్‌ చరిత్రలో ఇదే తొలిసారి.. మాజీ క్రికెటర్లకు అరుదైన గౌరవం | CPL Hall Of Fame, Dwayne Bravo And Ian Bishop Make History As Inaugural Inductees, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

క్రికెట్‌ చరిత్రలో ఇదే తొలిసారి.. మాజీ క్రికెటర్లకు అరుదైన గౌరవం

Aug 18 2026 7:16 AM | Updated on Aug 18 2026 11:02 AM

WI Former Cricketers DJ Bravo-Ian Bishop-Inducted-Hall-Of-Fame CPL

Photo Credit: Twitter

వెస్టిండీస్ మాజీ క్రికెట‌ర్లు ఇయాన్ బిష‌ప్‌, డ్వేన్ బ్రావోల‌కు అరుదైన గౌరవం ల‌భించింది. క‌రీబీయ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో ఈ ఇద్ద‌రిని చేర్చారు. కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో మాజీ ఆటగాళ్లకు హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌ గౌరవాన్ని ప్రకటించడం ఇదే తొలిసారి. ఇక ప్లేయ‌ర్ కేట‌గిరీలో బ్రావో తొలి క్రికెట‌ర్‌గా హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు ద‌క్కించుకోగా, నాన్ ప్లేయ‌ర్ కేట‌గిరీలో ఇయాన్ బిష‌ప్‌కు చోటు క‌ల్పించడం జ‌రిగింది. 

విండీస్ స్టార్ ఆల్‌రౌండ‌ర్‌గా పేరు పొందిన డ్వేన్ బ్రావో క‌రీబియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌లో 100కు పైగా మ్యాచ్‌లు ఆడాడు. 2013లో ప్రారంభ‌మైన క‌రీబియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌లో మొద‌టి సీజ‌న్ నుంచి ఆడుతూ వ‌చ్చిన బ్రావో 2024 వ‌ర‌కు లీగ్‌లో ఆట‌గాడిగా కొన‌సాగాడు. అదే స‌మ‌యంలో ఇయాన్ బిష‌న్ 2013 నుంచి క‌రీబియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌లో లీడింగ్‌ కామెంటేట‌ర్‌గా కొన‌సాగుతూ వ‌స్తున్నాడు.

ఇక ఈతరం టీ20 బెస్ట్ ఆల్‌రౌండ‌ర్ల‌లో డ్వేన్ బ్రావో పేరు త‌ప్పకుండా ఉంటుంది. అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్‌లో వెస్టిండీస్ సాధించిన రెండు టీ20 ప్ర‌పంచ‌క‌ప్పుల్లో బ్రావో స‌భ్యుడిగా ఉన్నాడు. ఇక ఐపీఎల్‌లో ఆరుసార్లు చాంపియ‌న్‌గా నిలిచిన‌ సీఎస్‌కేకు ప్రాతినిధ్యం వ‌హించాడు. వీటితో పాటు బీబీఎల్‌, బీపీఎల్ కూడా ఆడాడు. 

ఇక క‌రీబియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌లో 107 మ్యాచ్‌లాడిన బ్రావో ఇందులో ఒక్క ట్రిన్‌బాగో నైట్ రైడ‌ర్స్ త‌ర‌ఫునే 89 మ్యాచ్‌లు ఆడ‌డం విశేషం. ఇక 107 మ్యాచ్‌ల్లో వెయ్యికి పైగా ప‌రుగులు, 129 వికెట్లు ప‌డ‌గొట్టాడు. త‌న సీపీఎల్ కెరీర్‌లో ఐదుసార్లు టైటిల్స్ అందుకున్న బ్రావో.. నాలుగుసార్లు నైట్‌రైడ‌ర్స్ త‌ర‌ఫున‌, ఒక్క‌సారి సెంట్ కిట్స్ అండ్ నెవిస్ పాట్రియాట్స్ కెప్టెన్‌గా సీపీఎల్ టైటిల్ అందుకున్నాడు.

ఇక ఇయాన్ బిషప్ క్రికెటర్‌గా కంటే కామెంటేటర్‌గానే ఎక్కువ పేరు ప్రఖ్యాతలు సంపాదించాడు. 2016 ఐసీసీ టీ20 ప్రపంచ కప్‌ వెస్టిండీస్ గెలిచిన సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు చిరస్మరణీయం. ఆనాడు బిషప్ చేసిన క్రికెట్ వ్యాఖ్యానం క్రికెట్ చరిత్రలో చిరస్మరణీయ క్షణాల్లో ఒకటిగా గుర్తుండిపోనుంది.

ఇదే మొదటిసారి
లీగ్‌కు అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులు, వారి సేవలను గుర్తించే ప్రయత్నంలో, సీపీఎల్‌, వెస్టిండీస్ క్రికెట్ బోర్డు సంయుక్తంగా CPL హాల్ ఆఫ్ ఫేమ్ కార్యక్రమాన్ని ప్రారంభించాయి. మొట్టమొదటి CPL హాల్ ఆఫ్ ఫేమ్ వచ్చే నెల సెప్టెంబర్ 15న నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమంలోనే  డ్వేన్ బ్రావో, ఇయాన్ బిషప్‌లు తమ హాల్ ఆఫ్ ఫేమ్ గౌరవాన్ని అందుకోనున్నారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement