ఒక్క సెంచ‌రీతో విండీస్ కెప్టెన్ రికార్డుల వ‌ర్షం | WI Captain-Shai Hope Century-Broke Many Records Vs IND 3rd ODI | Sakshi
Sakshi News home page

IND Vs WI: ఒక్క సెంచ‌రీతో విండీస్ కెప్టెన్ రికార్డుల వ‌ర్షం

Oct 3 2026 10:11 PM | Updated on Oct 3 2026 10:13 PM

WI Captain-Shai Hope Century-Broke Many Records Vs IND 3rd ODI

Photo Credit: Twitter

చండీగ‌ఢ్ వేదిక‌గా భార‌త్‌తో జ‌రుగుతున్న చివ‌రి వ‌న్డేలో వెస్టిండీస్ టార్గెట్‌ను ఛేదించే ప‌నిలో ఉంది. 352 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన వెస్టిండీస్ ప్ర‌స్తుతం 38 ఓవ‌ర్లు ముగిసేస‌రికి 3 వికెట్ల న‌ష్టానికి 255 ప‌రుగులు చేసింది. ఆ జ‌ట్టు కెప్టెన్ షెయ్ హోప్ అజేయ‌ సెంచ‌రీతో చెల‌రేగ‌గా, కీమో పాల్ (31) అత‌డికి స‌హ‌క‌రిస్తున్నాడు. 

ఈ నేప‌థ్యంలో షెయ్ హోప్ ఒక్క సెంచ‌రీతో అనేక రికార్డుల‌ను త‌న పేరిట లిఖించుకున్నాడు. 104 బంతుల్లో సెంచ‌రీ మార్క్ చేరుకున్న షెయ్ హోప్ ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, ఒక సిక్స‌ర్ ఉన్నాయి. కాగా వ‌న్డేల్లో హోప్‌కు ఇది 21వ సెంచ‌రీ. ఇక భార‌త గ‌డ్డ‌పై టీమిండియాపై అత్య‌ధిక సెంచ‌రీలు బాదిన బ్యాట‌ర్ల‌లో హోప్ చోటు సంపాదించాడు.

👉తాజాగా చేసిన సెంచ‌రీ హోప్‌కు నాలుగోది కాగా 14 ఇన్నింగ్స్‌ల్లో ఈ సెంచ‌రీలు చేశాడు. కివీస్ బ్యాట‌ర్‌ డారిల్ మిచెల్ కూడా నాలుగు సెంచ‌రీలు చేసిన‌ప్ప‌టికీ 8 ఇన్నింగ్స్‌ల్లోనే దీనిని అందుకున్నాడు. ఒక ద‌క్షిణాఫ్రికా దిగ్గ‌జం ఏబీ డివిలియ‌ర్స్ 11 ఇన్నింగ్స్‌ల్లో ఐదు సెంచ‌రీలు బాదాడు.

👉ఓవ‌రాల్‌గా టీమిండియాపై షెయ్ హోప్ ఐదు సెంచ‌రీలు చేశాడు. ఈ క్రమంలో భారత్‌పై వన్డేల్లో అత్యధిక సెంచరీలు బాదిన క్రికెటర్‌గా హోప్‌ తొలి స్థానంలో నిలిచాడు. హోప్‌ కంటే ముందు క్రిస్‌ గేల్‌ (4 సెంచరీలు) ఈ ఫీట్‌ సాధించాడు.

👉వ‌న్డేల్లో 21సెంచ‌రీల మార్క్‌ను అందుకునే క్ర‌మంలో హోప్‌కు 152 ఇన్నింగ్స్‌లు అవ‌స‌ర‌మ‌య్యాయి. ఈ క్ర‌మంలో అత్యంత త‌క్కువ ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్ సాధించిన బ్యాట‌ర్‌గా డికాక్‌, వార్న‌ర్‌ల‌తో క‌లిసి సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నాడు. ఇక 21 సెంచ‌రీలు చేసేందుకు హ‌షీమ్ ఆమ్లా 116 ఇన్నింగ్స్‌లు తీసుకొని తొలి స్థానంలో ఉండ‌గా, కోహ్లి (138 ఇన్నింగ్స్‌లు) రెండో స్థానంలో కొన‌సాగుతున్నాడు. డివిలియ‌ర్స్ (183 ఇన్నింగ్స్‌లు), రోహిత్ శ‌ర్మ (186 ఇన్నింగ్స్‌లు) నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు.

👉వ‌న్డేల్లో కెప్టెన్ క‌మ్ వికెట్ కీప‌ర్‌గా ఎక్కువ సెంచ‌రీలు సాధించిన బ్యాట‌ర్‌గా షెయ్ హోప్ (8 సెంచ‌రీలు) తొలి స్థానంలో నిలిచాడు.  ఇక ఎంఎస్ ధోని (6 సెంచ‌రీలు), ఏబీ డివిలియ‌ర్స్ (4 సెంచ‌రీలు) త‌ర్వాతి రెండు స్థానాల్లో కొన‌సాగుతున్నారు.

ఇదీ చదవండి: ద్రవిడ్‌ రికార్డు బద్దలు కొట్టిన కేఎల్‌ రాహుల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement