Photo Credit: BCCI Twitter
న్యూ చండీగఢ్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న చివరి వన్డేలో టీమిండియా బౌలర్ గుర్నూర్ బ్రార్ వన్డే క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డు నమోదు చేశాడు. వరుసగా మూడు వన్డేలు కలిపి అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్ల జాబితాలో గుర్నూర్ బ్రార్ చోటు సంపాదించాడు. విండీస్‌తో వన్డే సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు ఆడిన గుర్నూర్ ఇప్పటివరకు 253 పరుగులు ఇచ్చుకున్నాడు.
తద్వారా అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్‌గా గుర్నూర్ తొలి స్థానంలో నిలిచాడు. గుర్నూర్ తర్వాత కెవిన్ ఒబ్రియాన్ (2015లో) 246 పరుగులు సమర్పించుకొని రెండో స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత వరుసగా షాహిన్ అఫ్రిది (245 పరుగులు, 2019లో), మసకద్జ (244 పరుగులు, 2010లో), ఆడమ్ జంపా (240 పరుగులు, 2023లో), అల్జారీ జోసెఫ్ (240 పరుగులు, 2026లో), భువనేశ్వర్ కుమార్ (239 పరుగులు, 2015లో) ఉన్నారు.
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. 352 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ నిలకడగా ఆడుతోంది.ప్రస్తుతం వికెట్ నష్టానికి 147 పరుగులు చేసింది. షెయ్ హోప్ (61), అమీర్ జాంగో (66) క్రీజులో ఉన్నారు. అంతకముందు భారత్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 351 పరుగుల భారీ స్కోరు చేసింది. కేఎల్ రాహుల్ (129 నాటౌట్) అజేయ సెంచరీతో మెరవగా, రోహిత్ శర్మ (92) అర్థసెంచరీతో రాణించాడు.
ఇదీ చదవండి: వన్డే క్రికెట్‌లో టీమిండియా సరికొత్త రికార్డు


