ద్రవిడ్‌ రికార్డు బద్దలు కొట్టిన కేఎల్‌ రాహుల్‌ | KL Rahul Breaks Rahul Dravid Long Standing Record Vs WI 3rd ODI | Sakshi
Sakshi News home page

ద్రవిడ్‌ రికార్డు బద్దలు కొట్టిన కేఎల్‌ రాహుల్‌

Oct 3 2026 9:19 PM | Updated on Oct 3 2026 9:26 PM

KL Rahul Breaks Rahul Dravid Long Standing Record Vs WI 3rd ODI

Photo Credit: BCCI Twitter

వెస్టిండీస్‌తో జ‌రుగుతున్న మూడో వ‌న్డే మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ (87 బంతుల్లో 129 నాటౌట్‌) అజేయ సెంచ‌రీతో మెరిసిన సంగ‌తి తెలిసిందే.  ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వ‌చ్చి సెంచ‌రీతో చెల‌రేగిన రాహుల్ కెరీర్‌లో తొమ్మిదో సెంచ‌రీ సాధించాడు. త‌ద్వారా కేఎల్ రాహుల్ భార‌త దిగ్గ‌జం రాహుల్ ద్ర‌విడ్ రికార్డును బ‌ద్ద‌లుకొట్టాడు. 

కేఎల్ రాహుల్‌ ఇన్నింగ్స్‌కు ముందు, వెస్టిండీస్‌పై భారత వికెట్ కీప‌ర్ బ్యాటర్ చేసిన అత్యధిక వన్డే స్కోరు ద్రవిడ్ పేరిట ఉండేది. ద్ర‌విడ్ 124 బంతుల్లో 109 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. మ‌రోసారి ఇదే వెస్టిండీస్‌పై 124 బంతుల్లో 103 ప‌రుగుల‌తో నాటౌట్‌గా నిలిచాడు. ఇక వీరిద్ద‌రి త‌ర్వాత ఎంఎస్ ధోని (130 బంతుల్లో 95 ప‌రుగులు), స‌మీర్ దిఘే (96 బంతుల్లో 94 నాటౌట్‌) త‌ర్వాతి స్థానాల్లో ఉన్నారు. 

ఓవ‌రాల్‌గా వెస్టిండీస్‌పై వ‌న్డేల్లో అత్య‌ధిక వ‌న్డే స్కోర్లు సాధించిన వికెట్ కీప‌ర్ల‌లో జాస్ బ‌ట్ల‌ర్ అగ్ర‌స్థానంలో నిలిచాడు. 2019లో బ‌ట్ల‌ర్ 77 బంతుల్లోనే 150 ప‌రుగులు సాధించాడు. ఏబీ డివిలియ‌ర్స్ (44 బంతుల‌ల్ఓ 149 ప‌రుగులు) రెండో స్థానంలో ఉండ‌గా, బ్రెండ‌న్ టేల‌ర్ (124 బంతుల్లో 138 ప‌రుగులు) మూడో స్థానంలో ఉన్నాడు. ఇక కేఎల్ రాహుల్ (87 బంతుల్లో 129 నాటౌట్‌) నాలుగో స్థానంలో కొన‌సాగుతున్నాడు. పాకిస్తాన్ బ్యాట‌ర్ క‌మ్రాన్ అక్మ‌ల్‌ (125 బంతుల్లో 124 ప‌రుగులు) ఐదో స్థానంలో ఉన్నాడు.

దీంతోపాటు కేఎల్ రాహుల్ మ‌రో మైలురాయిని చేరుకున్నాడు. వెస్టిండీస్‌పై వన్డేల్లో సెంచరీ సాధించిన రెండో భారత వికెట్‌ కీపర్‌గా రాహుల్‌ నిలిచాడు. ద్రవిడ్‌ తొలి క్రికెటర్‌గా ఉన్నాడు. ఈ ఇద్దరు కర్ణాటక రాష్ట్రానికి చెందినవారు కావడం విశేషం. అలాగే అంత‌ర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లు క‌లిపి కేఎల్ రాహుల్ 10వేల ప‌రుగుల మైలురాయిని చేరుకున్నాడు. కాగా ఈ మైలురాయిని అందుకున్న 15వ భార‌త బ్యాట‌ర్‌గా నిలిచాడు.

ఇక మ్యాచ్ విష‌యానికొస్తే 352 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన వెస్టిండీస్ 32 ఓవ‌ర్లు ముగిసేస‌రికి 3 వికెట్ల న‌ష్టానికి 215 ప‌రుగులు చేసింది. షెయ్ హోప్ (96), కీమో పాల్ (5) క్రీజులో ఉన్నారు. అంత‌క‌ముందు రూథ‌ర్‌ఫోర్డ్ (23), అమీర్ జాంగో (67) అర్థ‌సెంచ‌రీ చేసి ఔట‌య్యారు.

చదవండి: వ‌న్డే చ‌రిత్ర‌లోనే భార‌త బౌల‌ర్ అత్యంత చెత్త రికార్డు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement