రాహుల్‌ సెంచరీ, దంచికొట్టిన రోహిత్‌.. విండీస్‌ టార్గెట్‌ 352 రన్స్‌ | KL Rahul Century-80 Balls-India Big Score Vs WI 3rd ODI | Sakshi
Sakshi News home page

రాహుల్‌ సెంచరీ, దంచికొట్టిన రోహిత్‌.. విండీస్‌ టార్గెట్‌ 352 రన్స్‌

Oct 3 2026 6:06 PM | Updated on Oct 3 2026 6:53 PM

KL Rahul Century-80 Balls-India Big Score Vs WI 3rd ODI

Photo Credit: BCCI Twitter

న్యూ చండీగఢ్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న చివరి వన్డేలో కేఎల్ రాహుల్ అజేయ సెంచరీతో మెరిశాడు. 80 బంతుల్లో సెంచరీ మార్క్‌ అందుకున్న కేఎల్‌ రాహుల్‌ ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, ఆరు సిక్సర్లు ఉన్నాయి. దీంతో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 351 పరుగుల భారీ స్కోరు చేసింది. 

కేఎల్ రాహుల్ (87 బంతుల్లో 129 నాటౌట్‌, 10 ఫోర్లు, ఆరు సిక్సర్లు)  విధ్వంసం సృష్టించగా,  అంతకముందు ఓపెనర్ రోహిత్ శర్మ (92) తృటిలో సెంచరీ చేజార్చుకోగా, రుతురాజ్ గైక్వాడ్ (57) అర్థసెంచరీతో రాణించారు. చివర్లో నమన్ ధీర్ (30) హోంగ్రౌండ్‌లో ఆకట్టుకున్నాడు. వెస్టిండీస్ బౌలర్లలో జైడన్ సీల్స్ మూడు వికెట్లు తీయగా, కీమో పాల్ రెండు వికెట్లు పడగొట్టాడు. కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (1), విరాట్ కోహ్లి గోల్డెన్ డక్ కావడంతో టీమిండియా ఆరంభంలోనే 4 పరుగుల వద్ద రెండు వికెట్లు కోల్పోయింది.

ఈ దశలో రోహిత్ శర్మ, రుతురాజ్‌లు కలిసి మూడో వికెట్‌కు 137 పరుగుల సెంచరీ భాగస్వామ్యంతో ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. అయితే 8 పరుగుల దూరంలో సెంచరీ చేజార్చుకోగా, హాఫ్ సెంచరీ చేసిన వెంటనే రుతురాజ్ కూడా వెనుదిరగడంతో భారత్ స్కోరు డౌన్ అయింది. 

ఈ దశలో వికెట్ కీపర్ కేఎల్ రాహుల్.. లోయర్ ఆర్డర్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించాడు. అతడికి నమన్ ధీర్ కూడా చక్కగా సహకరించాడు. ముఖ్యంగా చివరి ఓవర్‌లో రాహుల్ విశ్వరూపం ప్రదర్శించాడు. రెండు సిక్సర్లు, ఒక ఫోర్‌తో చెలరేగిన రాహుల్ జట్టు స్కోరును 350 పరుగుల మార్క్‌ను దాటించాడు. 

ఇదీ చదవండి: Asian Games: భార‌త పురుషుల హాకీ జ‌ట్టుకు స్వ‌ర్ణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement