ఆస్ట్రేలియాపై యువరాజ్‌ సింగ్‌ విధ్వంసం.. వణికిపోయిన బౌలర్లు | WCL 2026: Yuvraj Singhs Blistering 71 Powers India Champions to 196-7 Against Australia | Sakshi
Sakshi News home page

IND vs AUS: ఆస్ట్రేలియాపై యువరాజ్‌ సింగ్‌ విధ్వంసం.. వణికిపోయిన బౌలర్లు

Oct 3 2026 6:37 PM | Updated on Oct 3 2026 6:50 PM

WCL 2026: Yuvraj Singhs Blistering 71 Powers India Champions to 196-7 Against Australia

PC: X

వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్-2026 సీజన్ ఘనంగా ప్రారంభమైంది. ఈ టోర్నీలో భాగంగా షార్జా క్రికెట్‌ స్టేడియం వేదికగా ఆస్ట్రేలియా ఛాంపియన్స్‌తో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో ఇండియా ఛాంపియన్స్ బ్యాటర్లు సత్తాచాటారు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 196 పరుగుల భారీ స్కోరు సాధించింది.

యువరాజ్ విధ్వంసం
భారత ఇన్నింగ్స్‌లో కెప్టెన్‌ యువరాజ్‌ సింగ్‌ విధ్వంసం సృష్టించాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన యువీ తనదైన శైలిలో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. చారిత్రాత్మక షార్జా మైదానంలో సిక్సర్లు, ఫోర్లతో బౌండరీల వర్షం కురిపించాడు. ఈ టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ కేవలం 44 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్లతో 71 పరుగులు చేసి ఔటయ్యాడు. 

అతడితో పాటు యూసుఫ్ పఠాన్ (20 బంతుల్లో 1 ఫోర్‌, 4 సిక్సర్లతో 37), రిషి ధావన్‌ (12 బంతుల్లో 35) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. ఆసీస్‌‌ బౌలర్లలో బెన్ హిల్ఫెన్‌హాస్, బెన్ లాఫ్లిన్, ఫవాద్‌ అహ్మద్‌ తలా రెండు వికెట్లు చొప్పున పడగొట్టారు. కాగా తొలి మ్యాచ్‌కు డేవిడ్‌ వార్నర్‌ దూరం కావడంతో ఉస్మాన్‌ ఖావాజా ఆసీస్‌ జట్టును నడిపిస్తున్నాడు.

తుది జట్లు
ఇండియా ఛాంపియన్స్: యువరాజ్ సింగ్ (కెప్టెన్), నమన్ ఓజా (వికెట్ కీపర్), అంబటి రాయుడు, యూసఫ్ పఠాన్, ఇర్ఫాన్ పఠాన్, స్టువర్ట్ బిన్నీ, రిషి ధావన్, హర్భజన్ సింగ్, పియూష్ చావ్లా, మోహిత్ శర్మ, దావల్ కులకర్ణి.  

ఆస్ట్రేలియా ఛాంపియన్స్: ఉస్మాన్ ఖ్వాజా (కెప్టెన్), డి'ఆర్సీ షార్ట్, బెన్ డంక్, కాలమ్ ఫెర్గూసన్, జోనాథన్ వెల్స్, జో బర్న్స్, నాథన్ కౌల్టర్ నైల్, బెన్ లాఫ్లిన్, ఫవాద్ అహ్మద్, కేన్ రిచర్డ్సన్, బెన్ హిల్ఫెన్హస్.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement