ఆస్ట్రేలియా-ఎతో మూడు వన్డేల అనధికారిక మూడు వన్డేల సిరీస్‌కు ముందు భారత్-ఎ జట్టుకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా గాయం కారణంగా దూరమయ్యాడు. ఐపీఎల్-2026 నుంచి పోటీ క్రికెట్ దూరంగా ఉన్న హార్దిక్.. ఆసీస్-ఎ సిరీస్‌తో మైదానంలో అడుగు పెడతాడని అంతా భావించారు. కానీ బెంగుళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో కోలుకుంటున్న హార్దిక్ పాండ్యా తాజాగా మరో కొత్త గాయం బారిన పడ్డాడు. ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో అతడి కుడి కాలి మోకాలు కింద భాగంలో గాయమైంది.
స్కానింగ్ రిపోర్టుల ఆధారంగా అతను కనీసం మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఈ క్రమంలో అక్టోబర్ 6వ తేదీ నుంచి ఆస్ట్రేలియా-ఏ జట్టుతో జరిగే వన్డే సిరీస్ నుంచి అతడిని సెలక్టర్లు తప్పించారు.
దీంతో పాండ్యా స్దానంలో ముంబై ఆల్-రౌండర్ సూర్యాన్ష్ షెడ్గేకు చోటు దక్కింది. 23 ఏళ్ల ఈ యువ ఆల్‌రౌండర్ ఇప్పటికే సీనియర్ జట్టు తరపున అరంగేట్రం కూడా చేశాడు. ఇప్పుడు మరోసారి వైట్‌బాల్ క్రికెట్‌లో తన సత్తా చాటేందుకు అతడికి అవకాశం లభించింది.
షెడ్గే కూడా గాయం నుంచి కోలుకుని వస్తున్నాడు. హార్దిక్ విషయానికి వస్తే.. ఇప్పటికే విండీస్‌తో టీ20లకు కూడా దూరమైన ఈ బరోడా ఆల్‌రౌండర్ న్యూజిలాండ్ పర్యటనకు కూడా వెళ్లేది అనుమానమే,.
ఆసీస్‌తో సిరీస్‌కు భారత-ఎ జట్టు
ప్రియాన్ష్ ఆర్య, సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్ , రుతురాజ్ గైక్వాడ్, రజత్ పాటిదార్, కుమార్ కుషాగ్రా, నిశాంత్ సింధు, విప్రజ్ నిగమ్, అర్షిన్ కులకర్ణి, అర్షద్ ఖాన్, నమన్ ధీర్, సూర్యాన్ష్, ప్రభ్‌సిమ్రన్ సింగ్, గ్రూర్ సింగ్, గుర్జప్‌నీత్ సింగ్, యశ్ ఠాకూర్
చదవండి: IND vs AUS: యువరాజ్ విధ్వంసం.. ఆసీస్‌ను చిత్తు చేసిన భారత్


