యువ‌రాజ్ విధ్వంసం.. ఆసీస్‌ను చిత్తు చేసిన భార‌త్‌ | Yuvraj Singhs 71, Kulkarnis Four-For Power India To 46-Run Win In WCL 2026 | Sakshi
Sakshi News home page

IND vs AUS: యువ‌రాజ్ విధ్వంసం.. ఆసీస్‌ను చిత్తు చేసిన భార‌త్‌

Oct 4 2026 12:00 PM | Updated on Oct 4 2026 12:41 PM

Yuvraj Singhs 71, Kulkarnis Four-For Power India To 46-Run Win In WCL 2026

PC: x

వరల్డ్ ఛాంపియన్‌షిప్ లెజెండ్స్-2026 టోర్నీలో ఇండియా ఛాంపియన్స్ శుభారంభం చేసింది. శనివారం షార్జా వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మ్యాచ్‌లో 46 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది.

యువరాజ్ విధ్వంసం
భారత బ్యాటర్లలో కెప్టెన్ యువరాజ్ సింగ్ విధ్వంసం సృష్టించాడు. షార్జా మైదానంలో బౌండరీల వర్షం కురిపించాడు. ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడుతూ కేవలం 44 బంతుల్లోనే 71 పరుగులు సాధించి జట్టుకు భారీ స్కోరు అందించాడు. ఇన్నింగ్స్ ఆఖరిలో రిషి ధావన్‌(12 బంతుల్లో 35) మెరుపులు మెరిపించాడు. వీరిద్దరితో పాటు ఆల్‌రౌండర్ యూసఫ్ పఠాన్‌(20 బంతుల్లో 37) దూకుడుగా ఆడాడు. ఆసీస్‌‌ బౌలర్లలో బెన్ హిల్ఫెన్‌హాస్, బెన్ లాఫ్లిన్, ఫవాద్‌ అహ్మద్‌ తలా రెండు వికెట్లు చొప్పున పడగొట్టారు.

చెల‌రేగిన భార‌త బౌల‌ర్లు
197 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా ఛాంపియన్స్‌కు ఆదిలోనే భారీ షాక్ త‌గిలింది. కెప్టెన్‌ ఉస్మాన్ ఖావాజాను తొలి ఓవ‌ర్‌లోనే మొహిత్ శ‌ర్మ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఉస్మాన్ త్వ‌ర‌గా ఔటైన‌ప్ప‌టికి ఓపెనర్ డి'ఆర్సీ షార్ట్ (65) మెరుపు అర్ధశతకంతో చెల‌రేగాడు. ఆ తర్వాత భారత బౌలర్లు కమ్‌బ్యాక్ ఇచ్చారు. 

ముఖ్యంగా ధవాల్ కుల్కర్ణి నాలుగు వికెట్లతో ఆస్ట్రేలియా మిడిల్ ఆర్డర్‌ను కోలుకోలేని దెబ్బ తీశాడు. అత‌డితో పాటు మొహిత్ శర్మ మూడు, పీయూష్ చావ్లా రెండు వికెట్లు సాధించింది. భార‌త్ త‌మ త‌దుప‌రి మ్యాచ్‌లో అక్టోబ‌ర్ 4న షార్జా వేదిక‌గానే ఇంగ్లండ్‌తో త‌ల‌ప‌డ‌నుంది.
చదవండి: విండీస్‌ను గెలిపించిన హోప్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement