గెలిపించిన‌ షెయ్ హోప్.. వెస్టిండీస్ రికార్డు ఛేద‌న‌ | Shai Hope-Unbeaten-162 Runs-WI Chase Record-352 Runs-Target-Vs IND | Sakshi
Sakshi News home page

గెలిపించిన‌ షెయ్ హోప్.. వెస్టిండీస్ రికార్డు ఛేద‌న‌

Oct 3 2026 11:06 PM | Updated on Oct 3 2026 11:12 PM

Shai Hope-Unbeaten-162 Runs-WI Chase Record-352 Runs-Target-Vs IND

Photo Credit: Twitter

చండీగ‌ఢ్ వేదిక‌గా టీమిండియాతో జ‌రిగిన మూడో వ‌న్డేలో వెస్టిండీస్ 5 వికెట్ల తేడాతో సంచ‌ల‌న విజయాన్ని అందుకుంది. భార‌త్ విధించిన 352 ప‌రుగుల టార్గెట్‌ను 48.2 ఓవ‌ర్ల‌లో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ షెయ్ హోప్ (143 బంతుల్లో 162 నాటౌట్‌) అజేయ శ‌త‌కంతో జ‌ట్టు విజ‌యంలో కీల‌క‌పాత్ర పోషించ‌గా, అమీర్ జాంగో (67) అర్థ‌సెంచ‌రీ, కీమో పాల్ (44) కీల‌క ఇన్నింగ్స్ ఆడాడు. 

భార‌త బౌల‌ర్లలో సిరాజ్‌, గుర్నూర్ బ్రార్‌, కుల్దీప్ యాద‌వ్‌, న‌మ‌న్ ధీర్ త‌లా ఒక వికెట్ తీశారు. అంత‌క‌ముందు తొలుత బ్యాటింగ్ చేసిన భార‌త్ నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 351 ప‌రుగులు చేసింది.కేఎల్ రాహుల్ (129 నాటౌట్‌) అజేయ సెంచ‌రీతో ఆక‌ట్టుకోగా, రోహిత్ శ‌ర్మ (92) విధ్వంసం సృష్టించాడు. 

రుతురాజ్ గైక్వాడ్ (57) అర్థ‌సెంచ‌రీతో రాణించాడు. విండీస్ బౌల‌ర్ల‌లో జైడ‌న్ సీల్స్ 3 వికెట్లు తీయ‌గా, కీమో పాల్ రెండు వికెట్లు ప‌డ‌గొట్టాడు. భార‌త్‌పై వెస్టిండీస్‌కు ఇదే అత్య‌ధిక ప‌రుగుల రికార్డు ఛేద‌న కావ‌డం విశేషం. గ‌తంలో 2019లో చెన్నై వేదిక‌గా జ‌రిగిన‌ మ్యాచ్‌లో వెస్టిండీస్ 288 ప‌రుగుల టార్గెట్‌ను ఛేదించింది. ఇక మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను భారత్‌ 2-1 తేడాతో సొంతం చేసుకుంది. ఇరుజట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ అక్టోబర్‌ 6 నుంచి 17 వరకు జరగనుంది. అక్టోబర్‌ 6న జరగనున్న తొలి టీ20కి లక్నో వేదిక కానుంది.

ఇదీ చదవండి:  ముగిసిన ఆసియా గేమ్స్‌.. భార‌త్‌కు నాలుగో స్థానం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement