అతడికి చెప్పే దమ్ముందా? కోచ్‌లకు భయం.. అది డేంజర్‌! | Can Be Dangerous How Ex India Coach Doeschate Carefully Confronted Kohli | Sakshi
Sakshi News home page

అతడికి చెప్పే దమ్ముందా? కోచ్‌లకు భయం.. అది డేంజర్‌!

Nov 9 2026 4:58 PM | Updated on Nov 9 2026 5:12 PM

Can Be Dangerous How Ex India Coach Doeschate Carefully Confronted Kohli

కోహ్లి (PC: BCCI X)

ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాటర్లలో విరాట్‌ కోహ్లి ఒకడు. మూడు ఫార్మాట్లలోనూ తనదైన ముద్ర వేసిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌.. సారథిగానూ టీమిండియాను ముందుకు నడిపించాడు. టెస్టుల్లో జట్టును అగ్రస్థానంలో నిలిపిన ఘనత అతడిది.

విదేశీ గడ్డ మీద ముఖ్యంగా ఆస్ట్రేలియాలో బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ (BGT)ని టీమిండియా సొంతం చేసుకోవడంలో కోహ్లి పాత్ర కీలకం. అయితే, 2024-25 బీజీటీలో ఈ మాజీ సారథి బాగా ఇబ్బందిపడ్డాడు. ముఖ్యంగా ఆఫ్‌ సైడ్‌ బంతులను ఎదుర్కోలేక పదే పదే వికెట్‌ పారేసుకున్నాడు.

కోహ్లి ఇబ్బందిపడ్డాడు
ఇలాంటి తరుణంలో కోహ్లితో పాటు కోచింగ్‌ సిబ్బందిపై కూడా విమర్శలు వెల్లువెత్తాయి. అతడికి సరైన సలహాలు ఇచ్చే వారే లేరా? అంటూ కామెంట్లు వచ్చాయి. ఈ విషయంపై నాటి టీమిండియా అసిస్టెంట్‌ కోచ్‌ ర్యాన్‌ డష్కటే తాజాగా స్పందించాడు.

టాక్‌స్పోర్ట్‌ క్రికెట్‌ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. ‘‘ఆఫ్‌సైడ్‌ బంతుల్ని ఎదుర్కొనే క్రమంలో విరాట్‌ కోహ్లి ఆస్ట్రేలియాలో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి ఓ గొప్ప కథ చెబుతాను. నాలుగో టెస్టు సమయంలో అనుకుంటా. నేను అతడితో ఈ విషయంలో జోక్యం చేసుకుంటూ అతడితో మాట్లాడాను.

అది చాలా డేంజర్‌
అందుకు కోహ్లి కూడా బాగా స్పందించాడు. నిజానికి అతడు కూడా ఈ విషయం గురించి చర్చించేందుకు ఓ వ్యక్తి కోసం చూస్తున్నాడని నాకు అనిపించింది. అయితే, విరాట్‌ కోహ్లి వంటి దిగ్గజ ఆటగాడు ఫామ్‌లేమితో ఇబ్బంది పడుతున్న వేళ.. కోచ్‌ జోక్యం చేసుకోవడం.. నిజంగా సదరు కోచ్‌కు చాలా ప్రమాదకరం అని నా ఉద్దేశం.

ఏం మాట్లాడితే.. ఏం జరుగుతుందోనని చాలా మంది కోచ్‌లు నాలాగే భయపడతారు. అయితే, నేను మాత్రం ఆరోజు అతడితో ఎలాంటి ఘర్షణకు తావులేకుండా మాట్లాడాలని నిర్ణయించుకున్నాను. అందుకు తగ్గట్లే కోహ్లి చాలా బాగా స్పందించాడు. అంతేకాదు.. నా మాటలు పూర్తైన తర్వాత.. తాను ఎందుకు అదే షాట్‌ ఎంచుకున్నాడో కూడా చెప్పాడు.

ఆటగాళ్లే పవర్‌ఫుల్‌
కోచ్‌లు చెప్పిన విషయాలన్నింటినీ ఆటగాళ్లు పాటించాలని లేదు. అయితే, కొన్నిసార్లు చర్చల ద్వారా ఎంతో కొంత ఫలితం ఉంటుంది. అయితే, ఆధునిక యుగంలో పవర్‌ షిఫ్ట్‌ మొత్తం ఆటగాళ్లకు మరలింది. కాబట్టే ఇలాంటి విషయాల గురించి ఆటగాళ్లతో మాట్లాడాలంటే కోచ్‌లు జంకుతున్నారు’’ అని డష్కటే చెప్పుకొచ్చాడు.

ఇవీ చదవండి: ఫ్లాట్‌ వికెట్లకు అలవాటుపడ్డారు.. వీళ్లేం బౌలింగ్‌ చేస్తారనుకున్నా!
IND vs NZ ODIs: న్యూజిలాండ్‌కు భారీ ఎదురుదెబ్బ!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement