సెంచరీ దిశగా ఆఫ్గన్‌ కెప్టెన్‌.. ర‌స‌కందాయంలో తొలి టెస్టు | Day-3 Stumps: Two-AFG Batters Centuries-Vs ZIM-1st Test-Sharjah | Sakshi
Sakshi News home page

సెంచరీ దిశగా ఆఫ్గన్‌ కెప్టెన్‌.. ర‌స‌కందాయంలో తొలి టెస్టు

Nov 7 2026 6:47 PM | Updated on Nov 7 2026 6:55 PM

Day-3 Stumps: Two-AFG Batters Centuries-Vs ZIM-1st Test-Sharjah

Photo Credit: Twitter

షార్జా వేదిక‌గా అఫ్గానిస్తాన్‌, జింబాబ్వే మ‌ధ్య జ‌రుగుతున్న తొలి టెస్టు ర‌స‌కందాయంలో ప‌డింది. మూడో రోజు ఆట ముగిసే స‌మ‌యానికి అఫ్గానిస్తాన్ 125 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 402 ప‌రుగులు చేసింది. కెప్టెన్‌ రహ‌మ‌త్ షా (94 నాటౌట్‌) సెంచరీకి ఆరు పరుగుల దూరంలో నిలవగా, అతడితో పాటు జియా ఉర్‌ అక్బర్‌ క్రీజులో ఉన్నారు. ప్ర‌స్తుతం అఫ్గానిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో మరో 102 ప‌రుగులు వెనుక‌బ‌డి ఉంది.

మ్యాచ్‌కు మ‌రో రెండు రోజులు స‌మ‌యం మిగిలి ఉండ‌డంతో మ్యాచ్ దాదాపు డ్రా అయ్యే అవ‌కాశాలే ఎక్కువ‌గా ఉన్నాయి. ఆఫ్గ‌న్ బ్యాట‌ర్ల‌లో ఓపెన‌ర్ సెదికుల్లా అట‌ల్ (213 బంతుల్లో 105; 6 ఫోర్లు, 3 సిక్స‌ర్లు), ర‌హ‌మ‌నుల్లా (188 బంతుల్లో 113; 12 ఫోర్లు, ఒక సిక్స‌ర్‌) సెంచరీల‌తో చెల‌రేగారు. ఆఖ‌ర్లో వికెట్‌కీప‌ర్ ఇక్ర‌మ్ అలికిల్ (40) ప‌ర్వాలేద‌నిపించాడు. 

జింబాబ్వే బౌల‌ర్ల‌లో న్యుమ‌న్ నైమూరి మూడు వికెట్లు తీయ‌గా, గ్రేమీ క్రీమ‌ర్ రెండు వికెట్లు ప‌డ‌గొట్టాడు. అంతకముందు జింబాబ్వే తమ తొలి ఇన్నింగ్స్‌లో 504 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ బ్రియాన్ బెన్నెట్ (128), బ్రెండన్ టేలర్ (131) శతకాలతో అదరగొట్టగా, ఆఖర్లో గ్రేమీ క్రీమర్ (34 నాటౌట్) మెరవడంతో జింబాబ్వే 500 పరుగుల మార్క్‌ను దాటింది. అఫ్గానిస్తాన్ బౌలర్లలో మొహమ్మద్ సలీమ్‌, ఖయాస్ అహ్మద్‌లు చెరో 3 వికెట్లు తీయగా, జియావుర్ రెహ్మాన్ రెండు వికెట్లు పడగొట్టాడు.

ఇదీ చదవండి: ‘అతడి విషయంలో తొండి చేశారు.. మా శాపం ఫలించింది’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement