రేపు మూడో వ‌న్డే; గెలిస్తే చ‌రిత్ర సృష్టించనున్న టీమిండియా! | If-India-Win-3rd ODI-Vs NZ-11-Consecutive-ODI Series-Win-Streak-Ends | Sakshi
Sakshi News home page

రేపు మూడో వ‌న్డే; గెలిస్తే చ‌రిత్ర సృష్టించనున్న టీమిండియా!

Nov 9 2026 3:45 PM | Updated on Nov 9 2026 3:53 PM

If-India-Win-3rd ODI-Vs NZ-11-Consecutive-ODI Series-Win-Streak-Ends

Photo Credit: BCCI Twitter

న్యూజిలాండ్‌, భార‌త్ మ‌ధ్య మూడో వ‌న్డే మ్యాచ్‌కు హామిల్ట‌న్‌లోని సెడాన్ పార్క్ వేదిక కానుంది. తొలి రెండు వ‌న్డేల్లో విజ‌యాలు సాధించిన భార‌త్ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0తో ఆధిక్యంలో నిలిచింది. రేపు జ‌ర‌గ‌నున్న మూడో వ‌న్డేలోనూ గెలిచి సిరీస్‌ను చేజెక్కించుకోవాల‌ని భార‌త్ భావిస్తోంది. 

ఈ నేప‌థ్యంలో రేప‌టి వ‌న్డేలో టీమిండియా గెలిస్తే మాత్రం న్యూజిలాండ్ గ‌డ్డ‌పై చ‌రిత్ర సృష్టించ‌నుంది. అదేంటంటే, స్వ‌దేశంలో 2019 నుంచి వ‌రుస‌గా న్యూజిలాండ్ ఓటమ‌న్న‌దే ఎరుగ‌కుండా వ‌రుస‌గా 11 వ‌న్డే సిరీస్‌లు నెగ్గింది. ఆఖ‌రిసారి అంటే 2019లో న్యూజిలాండ్ త‌మ సొంత‌గ‌డ్డ‌పై వ‌న్డే సిరీస్‌ను భార‌త్‌కు కోల్పోయింది. ఏడేళ్ల త‌ర్వాత మ‌ళ్లీ కివీస్‌ను వారి గ‌డ్డ‌పైనే ఓడించి వ‌న్డే సిరీస్‌ను కైవ‌సం చేసుకునే స‌ద‌వకాశం టీమిండియా ముంగిట నిలిచింది.

కివీస్‌కు గాయాల బెడద..
ఒక‌ప‌క్క వ‌రుస గాయాలు కివీస్‌ను ఇబ్బంది పెడుతున్న వేళ, ఇప్పుడు సొంత‌గ‌డ్డ‌పై వ‌న్డే సిరీస్‌ను కోల్పోయే ప్ర‌మాదం ఆ జ‌ట్టును ఒత్తిడిలోకి నెట్టేసింది. కివీస్ పిచ్‌లు బౌలింగ్‌కు విప‌రీతంగా అనుకూలిస్తున్న వేళ‌, మూడో వ‌న్డేలోనూ భార‌త్ జాగ్ర‌త్త‌గా ఆడి విజ‌యం సాధించి సిరీస్ కైవ‌సం చేసుకోవాల‌ని భావిస్తోంది.

మ్యాచ్‌కు వర్షం ముప్పు..
కానీ రేప‌టి వ‌న్డేకు వ‌రుణుడు ఆటంకం క‌లిగించే అవ‌కాశ‌ముంది. సోమ‌వారం కూడా హామిల్ట‌న్‌లో భారీ వ‌ర్షం కుర‌వ‌డంతో ఇరుజ‌ట్ల ఆట‌గాళ్లు ఇండోర్ ప్రాక్టీస్‌కే ప‌రిమిత‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా బీసీసీఐ భార‌త ఆట‌గాళ్లు ఇండోర్ నెట్స్‌లో సాధ‌న చేస్తున్న ఫొటోల‌ను ప్ర‌త్యేకంగా పంచుకుంది. 

'ఎడతెరిపి లేని వర్షాల కార‌ణంగా భారత జ‌ట్టు శిక్ష‌ణ‌ను ఔట్‌డోర్ నుంచి ఇండోర్‌కు మారింది' అని క్యాప్ష‌న్ జ‌త చేసింది. ఇక టెస్టు సిరీస్‌కు స‌న్నాహకాల్లో భాగంగా భార‌త వ‌న్డే కెప్టెన్ శుబ్‌మ‌న్ గిల్ మూడో వ‌న్డే అనంత‌రం జ‌ట్టును వీడ‌నున్నాడు. అత‌డి స్థానంలో శ్రేయ‌స్ అయ్య‌ర్ సార‌థ్య బాధ్య‌త‌లు తీసుకోనున్నాడు.

న్యూజిలాండ్ తుదిజ‌ట్టు అంచనా: విల్ యంగ్, టిమ్ సీఫెర్ట్, హెన్రీ నికోల్స్, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, టామ్ లాథమ్ (వికెట్ కీపర్), మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), నాథన్ స్మిత్, కైల్ జేమీసన్, మాట్ ఫిషర్/క్రిస్టియన్ క్లార్క్, జాకబ్ డఫీ

భారత్ తుదిజ‌ట్టు అంచ‌నా: రోహిత్ శర్మ,  శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయ‌స్ అయ్యర్, కేఎల్‌ రాహుల్ (వికెట్ కీప‌ర్‌), నమన్ ధీర్, అక్షర్ పటేల్, అన్షుల్ కాంబోజ్, అకిబ్ నబీ,  గుర్నూర్ బ్రార్‌, అర్ష‌దీప్ సింగ్‌

ఇదీ చదవండి: ‘జట్టు కోసం వాళ్లు బలిపశువులయ్యారు’.. ఇది వంద శాతం నిజం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement