అత్యంత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్‌ | New Zealand Etch Shameful Record After 21 Years With India ODI Defeats | Sakshi
Sakshi News home page

అత్యంత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్‌

Nov 8 2026 11:57 AM | Updated on Nov 8 2026 12:02 PM

New Zealand Etch Shameful Record After 21 Years With India ODI Defeats

టీమిండియా చేతిలో వరుస పరాజయాలతో నేపథ్యంలో న్యూజిలాండ్ క్రికెట్‌ జట్టు ఓ చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఆ జట్టు 2026లో ఇప్పటివరకు అన్ని ఫార్మాట్లలో కలిపి భారత్‌ చేతిలో ఏకంగా 11 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది.

తద్వారా 21 ఏళ్లుగా చెక్కుచెదరకుండా ఉన్న తమ పేలవ రికార్డును బద్దలు కొట్టుకుంది. ఒకే క్యాలెండర్ ఇయర్‌లో ఒక ప్రత్యర్థి చేతిలో అత్యధిక ఓటములు ఎదుర్కొన్న తమ చెత్త రికార్డును అధిగమించింది. 2005లో ఆస్ట్రేలియా చేతిలో 10 ఓటములు (మూడు ఫార్మాట్లు) ఎదుర్కొన్న న్యూజిలాండ్‌.. ఈ ఏడాది ఇప్పటికే భారత్‌ చేతిలో 11 ఓటములు ఎదుర్కొంది. భారత్‌ చేతిలో రెండో వన్డేలో ఓటమితో ఈ ఘోర అపవాదును మూటగట్టుకుంది.

ఒక ఏడాదిలో ఒకే ప్రత్యర్థి చేతిలో న్యూజిలాండ్ అత్యధిక ఓటములు
- 11 ఓటములు: భారత్‌పై, 2026
- 10 ఓటములు: ఆస్ట్రేలియాపై, 2005
- 9 ఓటములు: ఇంగ్లండ్‌పై, 2008

నాలుగు సిరీస్‌లలో భారత్ ఆధిపత్యం
2026లో ఇప్పటివరకు భారత్‌తో న్యూజిలాండ్ నాలుగు సిరీస్‌లు లేదా టోర్నీల్లో తలపడింది. జనవరిలో జరిగిన వన్డే సిరీస్‌లో కివీస్ 2-1తో విజయం సాధించి శుభారంభం చేసింది.

అయితే ఆ తర్వాత భారత్ పుంజుకుంది. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 4-1తో కైవసం చేసుకుంది. అనంతరం టీ20 ప్రపంచకప్ ఫైనల్లోనూ న్యూజిలాండ్‌ను ఓడించి టైటిల్ అందుకుంది.

ఇటీవల జరిగిన టీ20 సిరీస్‌లోనూ భారత్ మూడు విజయాలు సాధించింది. తాజాగా వన్డే సిరీస్‌లో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోవడంతో కివీస్ ఖాతాలో పరాజయాల సంఖ్య 11కు పెరిగింది.

కాగా, ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నిన్న వెల్లింగ్టన్‌ వేదికగా జరిగిన రెండో వన్డేలో భారత్‌ డీఎల్ఎస్ పద్ధతిలో 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ సిరీస్‌లోని మూడో వన్డే హ్యామిల్టన్‌ వేదికగా నవంబర్‌ 10న జరుగనుంది. 

ఇదీ చదవండి: బంగ్లాదేశ్‌కు భారీ షాక్


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement