సాక్షి, హైదరాబాద్: బీసీసీఐ సీనియర్ మహిళల టి20 టోర్నీలో పాల్గొనే సౌత్‌జోన్ జట్టును ప్రకటించారు. ఎన్. గీత చైర్మన్‌గా ఉన్న సెలక్షన్ కమిటీ 15 మంది సభ్యుల టీమ్‌ను ఎంపిక చేసింది. ఈ జట్టుకు హైదరాబాద్ బ్యాటర్ ప్రణవి చంద్ర కెప్టెన్‌గా వ్యవహరించనుండగా, శుభ సతీశ్ వైస్ కెప్టెన్‌గా ఎంపికైంది.
భారత లెఫ్టార్మ్ స్పిన్నర్ ఎన్.శ్రీచరణి రెడ్డి, ఆఫ్ స్పిన్నర్ శ్రేయాంక పాటిల్ కూడా సౌత్ జోన్ తరఫున బరిలోకి దిగనున్నారు. ఈ టీమ్‌లో హైదరాబాద్ నుంచి ప్రణవిచంద్రతో పాటు వంకా పూజకు చోటు లభించగా, ఆంధ్ర నుంచి హెన్రిటా పెరీరా, షబ్నమ్ షకీల్, రంగలక్ష్మి ఎంపికయ్యారు.
సౌత్‌జోన్ జట్టు వివరాలు: ప్రణవి చంద్ర (కెప్టెన్), శుభ సతీశ్ (వైస్ కెప్టెన్), ఎన్.శ్రీచరణి, జి.కమలిని, డి.హేమలత, నిక్కీ ప్రసాద్, హెన్రిటా పెరీరా, వంకా పూజ, శ్రేయ పరాబ్, షబ్నమ్ షకీల్, నియా నాజీన్, శ్రేయాంక పాటిల్, మోనికా పాటిల్, రంగలక్ష్మి, ఈసీ కవీషా.


