జూనియర్ వరల్డ్ చాంపియన్‌షిప్‌కు ఎంపిక
బోనకల్ (ఖమ్మం): అంతర్జాతీయ స్థాయి ఐస్ స్కేటింగ్‌లో తెలంగాణ ,అమ్మాయి తల్లూరి నయనశ్రీ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ స్కేటింగ్ యూనియన్ (ఐఎస్‌యూ) జూనియర్ వరల్డ్ చాంపియన్‌షిప్‌కు ఎంపికైన తొలి భారత మహిళా స్పీడ్ స్కేటర్‌గా ఆమె గుర్తింపు పొందింది. వచ్చే ఏడాది కజకిస్తాన్‌లో ఈ టోర్నీ జరుగుతుంది.
ఇటలీలోని బోర్మియాలో ప్రస్తుతం జరుగుతున్న జూనియర్ ప్రపంచ కప్‌లో పాల్గొని ఆమె క్వాలిఫయింగ్ మార్క్‌ను అధిగమించింది. షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటింగ్ 500 మీటర్ల ఈవెంట్‌ను నయనశ్రీ 47.144 సెకన్లలో పూర్తి చేసిన వరల్డ్ చాంపియన్‌షిప్ అర్హత సాధించింది. ఖమ్మం జిల్లా బోనకల్ మండలం మోటమర్తి గ్రామానికి చెందిన నయనశ్రీ ప్రస్తుతం కెనడాలోని కల్గారీలో స్కేటింగ్ శిక్షణ పొందుతూ అక్కడే అండర్ గ్రాడ్యుయేట్ రెండో సంవత్సరం చదువుతోంది.


