తెలంగాణకు మూడు స్వర్ణాలు | Telangana wins three gold medals in ice skating championship | Sakshi
Sakshi News home page

తెలంగాణకు మూడు స్వర్ణాలు

Jul 5 2026 4:04 AM | Updated on Jul 5 2026 4:04 AM

Telangana wins three gold medals in ice skating championship

సాక్షి, హైదరాబాద్‌: జాతీయ ఐస్‌ స్కేటింగ్‌ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ స్కేటర్లు సత్తా చాటారు. ఉత్తరాఖండ్‌ వేదికగా ఇటీవల జరిగిన ఈ టోర్నమెంట్‌లో మనవాళ్లు 3 స్వర్ణాలు, రెండు రజతాలు, రెండు కాంస్య పతకాలు సాధించారు. అది్వక ముథార్,  సాత్విక్, ప్రతీక్‌ పసిడి పతకాలతో మెరవగా... ఉర్జిత్, తేజేశ్‌ వెండి పతకాలు సొంతం చేసుకున్నారు. శ్రీయ మురళి, జీవాన్ష్   సుంకరి కాంస్యాలు గెలుచుకున్నారు. 

రాష్ట్రంలో ఐస్‌ స్కేటింగ్‌ రింక్‌ అందుబాటులో ఉంటే... మరిన్ని పతకాలు సాధించడం ఖాయమని మన స్కేటర్లు ఆశాభావం వ్యక్తంచేశారు. ‘వింటర్‌ ఒలింపిక్స్‌లో ఐస్‌ స్కేటింగ్‌ నాలుగు విభాగాల్లో పోటీలు జరుగుతాయి. ఇప్పటి వరకు మన దేశానికి వింటర్‌ ఒలింపిక్స్‌లో ఒక్క పతకం కూడా రాలేదు. తెలంగాణలో ఐస్‌ స్కేటింగ్‌ రింక్‌ ఏర్పాటు చేస్తే... మన స్కేటర్లు మరింత రాటుదేలి దేశానికి తొలి పతకం అందించే అవకాశం దక్కుతుంది’ అని స్కేటింగ్‌ కోచ్, అర్జున అవార్డీ అనూప్‌ కుమార్‌ యామా అన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement