ఓటమిలోనూ చరిత్ర సృష్టించిన లంక కెప్టెన్! | Sri Lankan Great Breaks All-Time Record Vs India | Sakshi
Sakshi News home page

IND vs SL: ఓటమిలోనూ చరిత్ర సృష్టించిన లంక కెప్టెన్!

Aug 19 2026 4:09 PM | Updated on Aug 19 2026 4:43 PM

Sri Lankan Great Breaks All-Time Record Vs India

PC: X

శ్రీలంక క్రికెట్ జ‌ట్టుకు సొంత గ‌డ్డ‌పై ఘోర ప‌ర‌భావం ఎదురైంది. గాలే వేదిక‌గా టీమిండియాతో జరిగిన తొలి టెస్టులో 165 ప‌రుగుల తేడాతో శ్రీలంక ఓట‌మి పాలైంది. 372 ప‌రుగుల ల‌క్ష్యాన్ని చేధించ‌లేక ఆతిథ్య జ‌ట్టు చ‌త‌కిల ప‌డింది. భార‌త స్పిన్న‌ర్ మానవ్ సుతార్ (6 వికెట్లు) ధాటికి ల‌క్ష్య చేధ‌న‌లో శ్రీలంక 206 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. 

లంక ఇన్నింగ్స్‌లో కెప్టెన్‌ ధనంజయ డి సిల్వా (59), సోనల్ దినుష (84) మినహా మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. ఓ వైపు వికెట్లు కోల్పోతున్నప్పటికి డిసిల్వా, దినుష ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. వీరిద్దరూ 5వ వికెట్‌కు 95 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 

అయితే ధనంజయను   రవీంద్ర జడేజా అవుట్ చేయడంతో ఆ పార్టనర్‌షిప్‌కు తెరపడింది. ఆ తర్వాత లంక వికెట్ల పతనం మళ్లీ మొదలైంది. చివరి 4 వికెట్లను కేవలం 7 పరుగుల వ్యవధిలోనే కోల్పోయి లంక ఓటమి చవిచూసింది. అయితే ఈ మ్యాచ్‌లో లంక ఓడిపోయినప్పటికి.. కెప్టెన్‌ డిసిల్వా మాత్రం ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. 

వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ చరిత్రలో శ్రీలంక తరపున అత్యధిక ఫిప్టీ ప్లస్ స్కోర్లు చేసిన బ్యాటర్‌గా ధనంజయ నిలిచాడు. అతడికి ఇది డబ్ల్యూటీసీలో 23వ హాఫ్ సెంచరీ. తద్వారా దినేష్ చండిమాల్‌, దిముత్ కరుణరత్నే(22)లను డిసిల్వా అధిగమించాడు.
చదవండి: నిన్ను ఐపీఎల్‌కు తీసుకెళ్తా.. సిక్సర్లు కొట్టు: జైస్వాల్‌
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement