మళ్లీ అగ్రపీఠమెక్కిన బ్రూక్‌ | ICC Test Rankings Updated: Harry Brook Reclaims No 1 Spot, Dethrones Travis Head | Sakshi
Sakshi News home page

మళ్లీ అగ్రపీఠమెక్కిన బ్రూక్‌

Aug 19 2026 3:21 PM | Updated on Aug 19 2026 3:30 PM

ICC Test Rankings Updated: Harry Brook Reclaims No 1 Spot, Dethrones Travis Head

source: X

ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్ట్ బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో భారీ మార్పు చోటు చేసుకుంది. ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ మళ్లీ నంబర్‌ వన్ స్థానాన్ని దక్కించుకున్నాడు. ఆస్ట్రేలియా స్టార్ ట్రావిస్ హెడ్‌ను వెనక్కి నెట్టి అగ్రస్థానానికి చేరుకున్నాడు.

ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో హెడ్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లో 22, 17 పరుగులు మాత్రమే చేయడంతో అతని రేటింగ్ గణనీయంగా పడిపోయింది. ఫలితంగా అతను ఏకంగా మూడు స్థానాలు దిగజారి నాలుగో స్థానానికి పడిపోయాడు.

రూట్‌కు లాభం
బ్రూక్ మళ్లీ అగ్రస్థానాన్ని అందుకోగా, అతని ఇంగ్లండ్ సహచరుడు జో రూట్ రెండో స్థానానికి చేరుకున్నాడు. ఇటీవల బ్రూక్, రూట్ మధ్య నంబర్‌ వన్ స్థానం పలుమార్లు చేతులు మారింది. ఆసీస్‌ స్టార్‌ బ్యాటర్‌ స్టీవ్‌ స్మిత్‌ కూడా ఓ స్థానం మెరుగుపర్చుకొని మూడో స్థానానికి చేరుకున్నాడు. ఇవి మినహా 12వ స్థానం వరకు ఎలాంటి మార్పులు జరగలేదు.

బవుమా, కమిందు మెండిస్‌, శుభ్‌మన్ గిల్‌, రచిన్‌ రవీంద్ర, యశస్వి జైస్వాల్‌, బాబర్‌ ఆజం, చండీమల్‌, డారిల్‌ మిచెల్‌ వరుసగా 12వ స్థానం వరకు ఉన్నారు. టీమిండియా వికెట్‌కీపర్‌ బ్యాటర్‌ రిషబ్‌ పంత్‌ ఓ స్థానం మెరుగుపర్చుకొని 14 నుంచి 13వ స్థానానికి చేరాడు.

ఈ వారం ర్యాంకింగ్స్‌లో బంగ్లాదేశ్‌ బ్యాటర్లు గణనీయంగా లబ్దిపొందారు. ఆసీస్‌పై (తొలి టెస్ట్‌లో) సంచలన విజయంలో కీలకపాత్ర (తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ) పోషించిన ఓపెనర్‌ తంజిద్‌ హసన్‌ ఏకంగా 84 స్థానాలు మెరుగుపర్చుకొని 89వ స్థానానికి చేరగా.. నజ్ముల్‌ హసన్‌ షాంటో 9, మెహిది హసన్‌, మొమినుల్‌ హక్‌ తలో 5, షద్మాన్‌ ఇస్లాం 3 స్థానాలు మెరుగుపర్చుకున్నారు.

బౌలర్ల ర్యాంకింగ్స్‌ విషయానికొస్తే.. బుమ్రా, మ్యాట్‌ హెన్రీ, మిచెల్‌ స్టార్క్‌ టాప్‌-3లో కొనసాగుతుండగా.. బంగ్లాదేశ్‌ యువ పేసర్‌ హసన్‌ మహమూద్‌ ఏకంగా 26 స్థానాలు మెరుగుపర్చుకొని 38వ స్థానానికి చేరాడు. భారత బౌలింగ్‌ త్రయం కుల్దీప్‌, సిరాజ్‌, రవీంద్ర జడేజా వరుసగా 14, 15, 16 స్థానాల్లో ఉన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement