22ఏ భూ బాధితులకు అండగా బీఆర్‌ఎస్‌ | Harish Rao slams govt over 22A prohibited lands list | Sakshi
Sakshi News home page

22ఏ భూ బాధితులకు అండగా బీఆర్‌ఎస్‌

Aug 19 2026 3:13 PM | Updated on Aug 19 2026 3:18 PM

Harish Rao slams govt over 22A prohibited lands list

సాక్షి,తెలంగాణ భవన్‌: 22ఏ భూ బాధితులకు బీఆర్‌ఎస్‌ అండగా ఉంటుందని ఆ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు హామీ ఇచ్చారు. బుధవారం తెలంగాణ భవన్‌లో 22ఏ నిషేధిత భూ బాధితులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్‌ రావు మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం కుట్రతో భూములను 22ఏ నిషేధిత జాబితాలో చేర్చుతుంది.కష్టాల్లో ఉన్న వారికి బీఆర్‌ఎస్‌ అండగా ఉంటుంది

22ఏ భూ బాదితులకు బిఆర్ఎస్ లీగల్ సెల్ ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందుబాటులో ఉంటారు. మంచి మాటతో ప్రభుత్వం వినక పోతే ఎలాంటి పోరాటానికి అయినా సిద్ధం.30 ఏళ్ల క్రింద రిజిస్ట్రేషన్ అయితే ఇప్పుడు ఎందుకు ఇబ్బంది అవుతుంది. నిషేధిత జాబితా నుండి తీసివేయాలంటే 30 శాతం నుంచి 50 శాతం వరకు కమీషన్ తీసుకుంటున్నారు అని చెబుతున్నారు.

మంత్రి నిషేధిత జాబితా నుండి తీసేశారట..ముఖ్యమంత్రి నిషేధిత జాబితాలో పెట్టించారట. ముఖ్యమంత్రి,పొంగులేటికి రియల్ ఎస్టేట్ బాగా తెలిస్తే..బీఆర్ఎస్ నాయకులకు పోరాటాలు తెలుసు.ప్రభుత్వాన్ని విడిచి పెట్టేది లేదు. భువనగిరిలో 40వేల ఎకరాలు  నిషేధిత జాబితాలో పెట్టారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. సీఎంకు నాలుగు సార్లు చెప్పారని అన్నారు.

ముఖ్యమంత్రి , పొంగులేటిని భర్తరఫ్ చెయ్యి...అన్ని సజావుగా జరుగుతాయి.ప్రజలు ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఎందుకు లంచాలు ఇవ్వాలి. నిషేధిత జాబితాలో పెట్టిన  వాటిని వెంటనే తొలగించాలి.ముఖ్యమంత్రికి తెలియకుండా జరిగితే పొంగులేటిని వెంటనే భర్తరఫ్ చేయాలి. 22ఏ నిషేధిత భూముల విషయంలో ఏ1 రేవంత్ రెడ్డి,ఏ2 పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.

కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎకరాల్లో కొని గజాల్లో అమ్ముతున్నారని  ముఖ్యమంత్రి అంటున్నారు. హిల్ట్ పాలసీతో ఉద్యోగాలు పోగొట్టారు.ప్రజలకు నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు. ప్రభుత్వం చేసిన కుట్ర.. వెంటనే సుమోటోగా స్వీకరించి తొలగించాలి.భూ భారతీ సైట్ పని చేయడం లేదు. అవసరం అయితే ముఖ్యమంత్రి ఇల్లు ముట్టడిద్దాం’అని పిలుపునిచ్చారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement