2027 లో చేపట్టనున్న జనాభా లెక్కల్లో "కుల రహితులను మత రహితులను " కూడా గణించాలి.. !
సాక్షి, హైదరాబాద్: 2027 జనాభా లెక్కల్లో కుల, మత ప్రస్తావన లేకుండా కుల రహితులను మత రహితులుగా కూడా నమోదు చేసుకోవాలనుకునే వారిని కూడా పరిగణనలోకి తీసుకోవాలని కోరుతూ హైదరాబాద్‌కు చెందిన సీనియర్ జర్నలిస్టులు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తమ అస్తిత్వ ప్రకటన ప్రతి పౌరుడిప్రాథమిక హక్కు అనీ దీనిని గుర్తించి, గౌరవించాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో పిటిషన దాఖలు చేశారు. రానున్న జనాభా లెక్కల్లో కులగణనను కూడా భారత ప్రభుత్వం చేపడుతున్న తరుణంలో ఈ విజ్ఞప్తి ప్రాధాన్యతను సంతరించుకుంది.
మనదేశంలో వివిధ మత విశ్వాసాలు కలిగిన ప్రజలు మాత్రమే కాకుండా ఎటువంటి మతవిశ్వాసాలు లేని హేతువాదులు ,నాస్తికులు, భౌతిక వాదులు, మానవతావాదులతో సహా కమ్యూనిస్టులూ ఉన్నారనీ, వ్యక్తులుగా, సమూహాలుగా అనేక మంది వారి నిత్య జీవిత ఆచరణలో కుల రహిత , మత రహిత అస్తిత్వంతో ఉన్నారని పిటీషనర్లు పేర్కొన్నారు.
ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సామాజిక, ఆర్థిక సర్వేలో భాగంగా బీసీ కులగణన చేసిన నేపథ్యంలో హై కోర్టు ఆదేశాల మేరకు కుల రహితులను, మత రహితులను కూడా గణించింది. రాష్ట్రంలో 11.96 లక్షల మంది తమని తాము కుల రహితులుగా, మత రహితులుగా ప్రకటించుకున్నారు. రాష్ట్రంలో స్కూలు , కాలేజీ విద్యా స్థాయిలో డి.వి రామకృష్ణారావు, ఎస్ క్లారెన్స్ కృపాళిని దంపతులు 2010, 2017 లలో కోర్టు మెట్లు ఎక్కారు. తమ పిల్లవాడి బర్త్ సర్టిఫికెట్ కోసం డేవిడ్ ,రూపా దంపతులు కూడా కోర్టులో పోరాటం చేశారు. తెలంగాణలో కుల గణన సందర్భంలో కుల నిర్మూలన సంఘం వేసిన పిటిషన్ పై వెలువడిన తీర్పు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కుల రహితులను, మత రహితులను గణించింది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం జనాభా లెక్కల్లోనూ కుల రహితులను, మత రహితులను గణించమని కోరుతూ 12 మంది వేసిన రిట్ పిటిషన్ 1420/2026, కుల నిర్మూలన సంఘం వేసిన పిటిషన్ 40062/2025 లు హైకోర్టు బెంచ్‌కు రానుంది. ఆ నేపథ్యంలోఈ జనాభా లెక్కల్లో కుల రహితులను, మత రహితులను గణించమని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
పిటిషనర్‌లు
డీ వీ రామకృష్ణా రావు,
సామాజిక కార్యకర్త , జర్నలిస్ట్,
సి. వనజ
సీనియర్ జర్నలిస్ట్, పిటిషనర్
పిటిషనర్ల తరఫు హై కోర్టు న్యాయవాది
డీ సురేష్ కుమార్, 9182620682.


