తెలంగాణలో అమిత్ షా పర్యటన రద్దు | Union Home Minister Amit Shah Cancels Scheduled Telangana Visit | Sakshi
Sakshi News home page

తెలంగాణలో అమిత్ షా పర్యటన రద్దు

Oct 3 2026 4:52 PM | Updated on Oct 3 2026 4:58 PM

 Union Home Minister Amit Shah Cancels Scheduled Telangana Visit

హైదరాబాద్‌: కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదివారం (అక్టోబర్ 4న) తెలంగాణలో పర్యటించాల్సి ఉండగా దాన్ని రద్దు చేసుకున్నారు. ముందుగా ప్రకటించాల్సిన షెడ్యూల్‌ ప్రకారం కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ కార్యక్రమంలో అమిత్‌ షా ముఖ్య అతిథిగా హాజరుకావాల్సి ఉంది ఆ తర్వాత హైదరాబాద్‌కు వస్తారని బీజేపీ వర్గాలు భావించాయి. ఇటీవల తెలంగాణకు కొత్తగా నియమితులైన ఇన్‌ఛార్జ్‌లతో భేటీ అయ్యే ఛాన్స్ ఉందని బీజేపీ నేతలు అనుకున్నారు. 

అమిత్‌ షా ఆదివారం తూప్రాన్‌ మండలంలోని బ్రహ్మణపల్లిలో పర్యటించనున్నారన్న సమాచారం నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లపై ఇప్పటికే తూప్రాన్‌ మున్సిపల్‌ కార్యాలయంలో ఏఎస్‌ఎల్‌ సమావేశం నిర్వహించారు. అమిత్‌ షా పర్యటనకు సంబంధించిన భద్రతా ప్రణాళిక వేసుకున్నారు. చివరకు అమిత్ షా పర్యటన రద్దయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement