వచ్చే ఎన్నికల్లో పోటీపై మంత్రి ఉత్తమ్‌ కీలక ప్రకటన | Uttam Kumar Reddy Key Statement On Contesting In Next Elections | Sakshi
Sakshi News home page

వచ్చే ఎన్నికల్లో పోటీపై మంత్రి ఉత్తమ్‌ కీలక ప్రకటన

Oct 3 2026 8:55 PM | Updated on Oct 3 2026 8:55 PM

Uttam Kumar Reddy Key Statement On Contesting In Next Elections

సాక్షి, హైదరాబాద్‌: వచ్చే ఎన్నికల్లో పోటీపై మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి కీలక ప్రకటన చేశారు. డీలిమిటేషన్‌ జరిగితే తుంగతుర్తిలో పోటీ చేస్తారనే ప్రచారాన్ని ఖండించిన మంత్రి ఉత్తమ్‌.. హుజూర్‌నగర్‌ నుంచే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని తేల్చి చెప్పారు. సోషల్ మీడియా ప్రచారాన్ని నమ్మొద్దన్నారు.

తుంగతుర్తిలోని తాను పుట్టిన సొంత గ్రామం తాటి పాములలో అభివృద్ధి పనులు చేస్తున్నట్లు  ఉత్తమ్ పేర్కొన్నారు. కాళేశ్వరం మూడు బ్యారేజిలలో మొత్తం డిజైన్ సమస్య అయితే ప్రభుత్వమే ఖర్చు భరిస్తుందన్నారు. నిర్మాణ సంస్థలు పరిధిలో ఏదైనా సమస్యలు ఉంటే వాళ్లే నిదులు ఖర్చు చేస్తారని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.

ఇదీ చదవండి: గులాబీ ‘పట్టా’దార్‌ ఎవరో?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement