‘నాకు టికెట్‌ ఇవ్వడానికి రేవంత్‌ ఎవరు?’ | Konda Sushmitha Slams CM Revanth Reddy | Sakshi
Sakshi News home page

‘నాకు టికెట్‌ ఇవ్వడానికి రేవంత్‌ ఎవరు?’

Aug 19 2026 3:59 PM | Updated on Aug 19 2026 4:24 PM

Konda Sushmitha Slams CM Revanth Reddy

గీసుకొండ(వరంగల్‌ జిల్లా): తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై కొండా మురళి-సురేఖ దంపతుల కుమార్తె కొండా సుస్మిత ఘాటు వ్యాఖ్యలు చేశారు. పరకాల అసెంబ్లీ సీటు అంశానికి సంబంధించి సిట్టింగ్‌  ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డికి సీటు ఇస్తున్నట్లు ఇటీవల రేవంత్‌ ప్రకటించడంపై సుస్మిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అసలు సీటు ఇవ్వడానికి రేవంత్‌ ఎవరు? అంటూ ప్రశ్నించారు. 

‘సీఎం రేవంత్‌రెడ్డి కళ్లు నెత్తికెక్కాయా?, రేవూరికి టికెట్‌ ఎలా ఇస్తావ్‌. రేవంత్‌రెడ్డి మాట తప్పావు. పరకాలలో నేనే పోటీ చేస్తా.. గెలిచి తీరుతా. బీసీలు అంటే చులకనా?, టీడీపీ సభ్యులు అంటే రేవంత్‌కు ఎందుకంత ప్రేమ?, రేవంత్‌లా ఊడిగం చేయడం మాకు రాదు. ఇది ఒరిజినల్‌  కాంగ్రెస్‌ కాదు.. 

పచ్చ కాంగ్రెస్‌.  నాకు టికెట్‌ ఇవ్వడానికి రేవంత్‌ ఎవరు?, అధిష్టానం ఇస్తుంది. రేవంత్‌రెడ్డితో పాటు పొంగులేటి ఉంటున్నాడు. రేవంత్‌ ముఖ్యమంత్రా.. పొంగులేటి ముఖ్యమంత్రా?, అనవసరంగా కెలికావు.. నీ బండారం బయటపెడతా. నీ తమ్ముడు షెల్‌ కంపెనీకి రూ. 200 కోట్లు ధారాదత్తం చేశావు. కొండా మురళీ తిరిగి గెలిపిస్తే రేవూరి ఎమ్మెల్యే అయ్యాడు.  

రెండు, మూడు నియోజక వర్గాల్లో తిరిగి గెలిపించింది కొండా మురళి. రేవంత్ రెడ్డి పీసీసీ కావాలని కోరుకున్న మొదటి వ్యక్తులు కొండా దంపతులు. పరకాలలో నా ఇళ్ళు ఇస్తా, అక్కడే ఉండి రేవూరిని  గెలిపించుకో. రేవూరి గెలుస్తాడో...కొండా మనిషి గెలుస్తాడో చూద్దాం. 119 నియోజకవర్గాల్లో టికెట్లను నువ్వే ప్రకటించు, అధిష్టానం ఎందుకు.?’ అని తీవ్రస్థాయిలోధ్వజమెత్తారు.

‘నాకు టికెట్‌ ఇవ్వడానికి రేవంత్‌ ఎవరు?’ కొండా బిడ్డ.. గూస్ బంప్స్ స్పీచ్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement