ప్రకాశం: స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ గెలుపు కోసం కార్యకర్తలు కృషి చేయాలని పార్టీ రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి విజ్ఞప్తి చేశారు. వైఎస్ జగన్ పాలనలో రైతులు రాజుల్లా బతికారని, అదే కూటమి పాలనలో గిట్టుబాటు ధర లేక రైతులు అవస్థలు పడుతున్నారన్నారు. వైఎస్ హయాంలోనే గుండ్లకమ్మ రామతీర్థం ప్రాజెక్ట్ పూర్తి అయ్యిందని, వెలిగొండ కూడా ఆయన హయాంలోనే 60 శాతం పూర్తి చేశారన్నారు.
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైఎస్సార్‌సీపీ జడ్పీటీసీ-ఎంపీటీసీ సభ్యులతో సమావేశ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైఎస్సార్‌సీపీ శ్రేణులు భారీగా హాజరయ్యాయి. దీనిలో భాగంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ‘ రాష్ట్రంలో రైతు కుదేలైపోతున్నాడు. ఏ పంటకు గిట్టుబాటు ధరలేదు. జగన్ హయాంలో రైతు రాజుగా వెలుగొందాడు. స్థానిక సమస్థల ఎన్నికలలో గట్టి పోటి ఖచ్చితంగా ఇవ్వాలి. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు అర్దం అయ్యేటట్టుగా వివరించాలి’ అని సూచించారు.
ఇక వైఎస్సార్‌సీపీ రాష్ట్ర రీజనల్ కో-ఆర్డినేటర్ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి మాట్లాడుతూ.. ‘ రాష్ట్రంలో కడప తరువాత ప్రకాశం జిల్లానే పార్టీకి కంచుకోట. పోయిన స్థానిక సమస్థల ఎన్నికలలో 99 శాతం విజయం సాధించాం. అదే పట్టుదలను ఇప్పుడు కొనసాగించాలి’ అని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: ప్రజల తీర్పును ఎదుర్కొనే ధైర్యం చంద్రబాబుకు ఉందా?..


