కాంగ్రెస్‌కు షాక్ ఇవ్వనున్న అఖిలేశ్ యాదవ్..? | Akhilesh Yadav set to deal a blow to Congress in UP | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌కు షాక్ ఇవ్వనున్న అఖిలేశ్ యాదవ్..?

Nov 18 2026 8:47 PM | Updated on Nov 18 2026 8:51 PM

Akhilesh Yadav set to deal a blow to Congress in UP

సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) కూటమి చర్చలు ఇంకా ప్రారంభం కాకముందే ఇరు పార్టీల మధ్య సీట్ల విషయంలో విభేదాలు మొదలయ్యాయి. గత ఎన్నికల్లో ఎస్పీ గెలిచిన స్థానాలతో పాటు తాము రెండో స్థానంలో నిలిచిన నియోజకవర్గాలను కాంగ్రెస్‌కు ఇచ్చేందుకు అఖిలేశ్ యాదవ్ పార్టీ సిద్ధంగా లేదని సమాచారం.

నవంబర్ 23, 24 తేదీల్లో ఇరు పార్టీల నేతల కమిటీలు సీట్ల పంపకాలపై చర్చించనున్నాయి. ఈ చర్చలు కాంగ్రెస్ తరఫున కేసీ వేణుగోపాల్, ప్రియాంక గాంధీ పర్యవేక్షణలో జరగనున్నాయి.  అటు సమాజ్‌వాదీ పార్టీ తరఫున రాజీవ్ రాయ్, ధర్మేంద్ర యాదవ్ పాల్గొనే అవకాశం ఉంది.

2022 అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీ 111 స్థానాల్లో విజయం సాధించగా, 223 చోట్ల రెండో స్థానంలో నిలిచింది. ఈ 334 నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌తో సీట్ల సర్దుబాటు ఉండకపోవచ్చని ఎస్పీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో కాంగ్రెస్‌కు మిగిలేది మొత్తంగా 69 స్థానాలు మాత్రమే. అయితే అమేథీ, రాయ్‌బరేలీ పరిధిలోని కొన్ని స్థానాలను తమకు కేటాయించాలని కాంగ్రెస్ కోరనున్నట్లు తెలుస్తోంది.

ఇక మరోవైపు బీజేపీని ఓడించగల అభ్యర్థులకే ప్రాధాన్యం ఇవ్వాలని ఎస్పీ నేతలు చెబుతున్నారు. కానీ కాంగ్రెస్ మాత్రం తమ పార్టీ గౌరవానికి ఏమాత్రం భంగం కలగకుండా సీట్ల పంపకం జరగాలని పట్టుబడుతోంది. ఈ విషయంపై తుది నిర్ణయం రాహుల్ గాంధీ, అఖిలేశ్ యాదవ్ తీసుకోనున్నారు. అయితే కాంగ్రెస్‌కు 100కు పైగా స్థానాలు కేటాయించే అవకాశాలు తక్కువగా ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఇదీ చదవండి: రూ.40 కోట్ల విలువైన ఆభరణాలు లూటీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement