రూ.40 కోట్ల విలువైన ఆభరణాలు లూటీ | Robbers Loot Jewellery Worth 40 Crores In Bihar‌ | Sakshi
Sakshi News home page

రూ.40 కోట్ల విలువైన ఆభరణాలు లూటీ

Nov 18 2026 7:00 PM | Updated on Nov 18 2026 7:13 PM

Robbers Loot Jewellery Worth 40 Crores In Bihar‌

బీహార్: బీహార్‌లో పట్టపగలే భారీ దోపిడీ జరిగింది. పశ్చిమ చంపారన్ జిల్లా బెట్టియాలోని సెంకో జ్యువెలర్స్ షోరూమ్‌లోకి మూడు బైక్‌లపై వచ్చిన ఎనిమిది మంది దుండగులు చొరబడి సుమారు రూ.30 నుంచి 40 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు.

ఆయుధాలతో షోరూమ్‌లోకి ప్రవేశించిన దుండగులు సిబ్బందితో పాటు అక్కడ ఉన్న కస్టమర్లను కూడా తమ అదుపులోకి తీసుకుని వారి చేతులు కట్టేశారు. అంతేకాదు వారి మొబైల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకుని షోరూమ్‌లోని మొత్తం నగలను మూటగట్టుకున్నారు. అయితే ఈ ఘటనలో షోరూమ్‌లోని ఇద్దరికి గాయాలయ్యాయి. దాంతో వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని జరిగిన ఘటణపై విచారణ చేపట్టారు. దోపిడీకి గురైన నగల విలువను అంచనా వేస్తున్నారు. నిందితులను గుర్తించి పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు.

అయితే వెళ్లిపోయే ముందు ఆ దుండగులు ‘మళ్లీ వస్తాం.. ఇదంతా సినిమా’ అంటూ హెచ్చరించినట్లు ప్రత్యక్ష సాక్షి ఒక మహిళ వెల్లడించింది. 

ఇదీ చదవండి: న్యాయపోరాటం ఓవైపు.. తండ్రి దుకాణం మరోవైపు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement